టీడీపీ , వైసీపీలలో ఎవరిది పైచేయి?

Rayalaseema voters,TDP, YCP, Chandrababu, YS Jagan, Kadapa District, Kurnool, Anantapur, Constituencies, Chittoor
Rayalaseema voters,TDP, YCP, Chandrababu, YS Jagan, Kadapa District, Kurnool, Anantapur, Constituencies, Chittoor

రాయలసీమ  అధికార వైసీపీకి  కంచుకోట అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతూ ఉంటారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి  వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ..రాయల సీమలో ఉన్న ఆ నాలుగు జిల్లాలు పెట్టని కోటగా ఉంటూ వస్తున్నాయి. రాయలసీమలోని కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు, కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు,  అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు,  చిత్తూరు జిల్లాలోని  14 మొత్తం 52 నియోజకవర్గాలు ఉన్నాయి.

2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గాలి ప్రభంజనంలా వీయడంతో.. తెలుగు దేశం పార్టీ కేవలం మూడు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్‌, హిందూపురం నియోజకవర్గంలో నంద మూరి బాలకృష్ణ ,  కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయువు మాత్రమే విజయం సాధించారు.చంద్రబాబు గెలిచినా కూడా  టీడీపీ శ్రేణులు ఆశ్చర్యపోయేంతగా మెజార్టీ బాగా పడిపోయింది .

అయితే అప్పటికి ఇప్పటికీ వైఎస్సార్సీపీ  గ్రాఫ్ పడిపోయింది. రాజకీయ సమీకరణాలు కూడా మారిపోవడంతో.. ఇప్పుడు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సారి  వైసీపీకి  అక్కడ ఎన్ని ఓట్లు వస్తాయి..తెలుగు దేశం పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందంటూ ఇప్పటికే రకరకాల సర్వేలు వెలువడ్డాయి.

ఈ సర్వేల ప్రకారం ఈ సారి వైఎస్సార్సీపీ పరిస్థితి..రాయల సీమ ప్రాంతంలో ఏ మాత్రం  ఆశాజనకంగా లేనట్టు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ వర్గాలే స్వయానా  ఈ విషయం ఓపెన్‌గా చెప్పుకొనే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. చివరకు ప్రభుత్వ అధికారులు కూడా ఇదే విషయాన్ని వివరిస్తున్నారు. ఈ సారి రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో తెలుగు దేశం పార్టీ  20 స్థానాల నుంచి 27  వరకు గెలిచే పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.

అనంతపురం జిల్లాలో 14 సీట్లలో తెలుగు దేశం పార్టీకి  7 నుంచి 9 వరకు ఈజీగా  గెలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 14 సీట్ల జాబితాలో  రాఫ్తాడు, సింగనమల, హిందూపురం, ఉరవకొండ, కదిరి, కళ్యాణదుర్గం, పెనుగొండ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 14 సీట్లలో డోన్‌, ఎమ్మిగనూరు, పత్తికొండ, బనగానపల్లె, ఆలూరు సీట్లలో సైకిల్ హవానే కనిపిస్తుందంటున్నారు స్థానిక నేతలు.

అలాగే  కడప జిల్లా విషయానికి వస్తే..అక్కడున్న  10 సీట్లలో 3 వరకు తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకోవడం  గ్యారెంటీ అని వైసీపీ వర్గాలు కూడా ఓపెన్‌గా  చెపుతున్నాయి. వీటితో పాటు కమలాపురం,రైల్వేకోడూరు, మైదుకూరు, రాజంపేట, ప్రొద్దుటూరులో మూడు స్థానాల వరకూ గెలిచే ఛాన్సులు ఉన్నాయని ఇటు విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

ఇక చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, కుప్పం,నగరి, శ్రీకాళహస్తి,పలమనేరు స్థానాలతో పాటు మరో రెండు మూడు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ బలంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ సారి సీమలో టీడీపీ బలం పెరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ బలాన్ని ఓట్ల రూపంలో టీడీపీ సాధించగలుగుతుందా లేక వైసీపీనే మరోసారి కంచుకోటలో పాగా వేస్తుందా అన్న విషయం తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY