జనవరి 28, మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల చివరిరోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ముందుగా మండలి రద్దు తీర్మానానికి సంబంధించిన ప్రతులు, ఇతర వివరాలను శాసనసభ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, హోం, న్యాయ శాఖలకు పంపించారు. ఏపీ శాసనమండలి రద్దుపై కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. లోక్ సభ, రాజ్యసభలతో పాటుగా రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం ఏపీ శాసనమండలి రద్దు పక్రియ పూర్తి కానుంది.
[subscribe]