పోలింగ్ ముగిసిన మర్నాడు నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఇచ్చిన నివేదిక లో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అల్లర్లు వెనుక ఎవరున్నారో ఇప్పటికే గుర్తించారు. అవేమీ అనూహ్యంగా జరిగిన గొడవలు కావని, ముందస్తు ప్లాన్ ప్రకారమే.. అల్లర్లకు సిద్ధంగా ఉన్నారని సిట్ తన నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. అంతేకాదు.. అల్లర్లను అదుపులో చేయడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని నిర్ధారణకు వచ్చింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను సిట్ అధికారులు పరిశీలించారు. 150 పేజీలతో సుదీర్ఘ నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ సమర్పించారు. అలాగే ఎన్నికల సంఘానికి నివేదికను ఇవ్వనున్నారు. మొత్తం ఐదు అంశాలపై సిట్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేశారు. డీజీపీని కలిసి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ నివేదికను సీఈఓ ఎంకే మీనాకు అందజేశారు. నివేదిక అందిన వెంటనే అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి సమావేశం అయ్యారు. ఏపీ డీజీపీ, ఇంటెల్‌జెన్స్ చీఫ్ లతో సమావేశం అయ్యారు.
అల్లర్ల కేసు దర్యాప్తులో అనేక లోపాలను సిట్ గుర్తించిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్చించినట్లు తెలిసింది. దీనిలో ఇప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కార్చన్ సెర్చ్ కు పోలీసులు సిద్ధం అయ్యారు. అన్ని నియోజకవర్గాలలోనూ భద్రతా దళాలను మొహరింప చేస్తున్నారు. ఈరోజు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కార్డన్ సెర్చ్ లు కొనసాగాయి. పోలింగ్ అనంతరం రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో దాడులకు తెగబడడం, ఈ అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా సిట్ నివేదిక రూపొందించడంతో కౌంటింగ్ రోజున ఎటువంటి ఘటనలు జరగకుండా, ముందస్తు వ్యూహం రూపొందిస్తున్నారు. అలర్ల నేపథ్యంలో ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించటానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులను డీజీపీ ఆదేశించారు. సీసీ టీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్‌లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని చెప్పారు. అల్లర్లకు పాల్పడ్డ వారిని అరెస్టులు చేయటంతో పాటు చార్జీ షీట్లు దాఖలు చేయాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురాల్లో నమోదైన కేసులు, నిందితులు, అరెస్టు అయిన వారి వివరాలు,జరిగిన సంఘటనలను తీవ్రమైన నేరాలుగా పరిగణించాలని సిట్ పేర్కొన్న నేపథ్యంలో తదుపరి చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారు.
సిట్ అందించిన 150 పేజీల నివేదిక ఆధారంగా అధికారులతో పాటు, రాజకీయ పార్టీల నేతలపై చర్యలకు కూడా సిద్ధమవుతున్నారు. కొందరి విషయంలో అవసరమైతే న్యాయ సలహాలను తీసుకోవాలని భావిస్తున్నారు. మొత్తం 33 కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దర్యాప్తులో చాలా లోపాలను గుర్తించి, సంబంధిత అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితులను అరెస్టు చేయాలని సిట్ కూడా ఇప్పటికే ఆదేశించింది. సరైన సెక్షన్లతో కోర్టులో మెమో వేసి, ప్రస్తుతం ఉన్న సెక్షన్లకు అదనంగా కలపాలని ఆదేశించినట్లు సీట్ ఛీప్ తెలిపారు. డిజిటల్ ఎవిడెన్స్ కింద సీసీ టీవీ ఫుటేజీ, వీడియోలను కూడా సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఛార్జిషీట్ వేయాలని చెప్పామన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY