తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరానికి ఈ రోజుతో ఎండ్ కార్డ్ పడనుంది. మే 13న అంటే సోమవారం రోజు పోలింగ్ జరగనుండటంతో..పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచీ కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా పోలింగ్‌కు 24 గంటల ముందు నుంచి అన్ని మైక్‌లు మూగబోతాయి. గ్రామాల సంగతి మినహాయించినా..చిన్న చిన్న సిటీల్లో, పట్టణాల్లో కఠిన ఆంక్షలు విధిస్తారు. ఈ రోజు నుంచి అనగా మే 11, శనివారం నుంచి అమల్లోకి రానున్నఈ కఠిన ఆంక్షలు.. మే 14 ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా జైలుకు కూడా పంపిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అలాగే పోలింగ్ రోజున.. పోలింగ్ బూత్‌లు లేదా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో.. సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. ఇక పోలింగ్ రోజు అంటే మే 13 న పోలింగ్ కేంద్రంలో ఓటర్లు రెండు క్యూలైన్లలో ఉండి మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు చెప్పారు.ఎన్నికలు ముగిసే వరకూ ఐదుగురు కంటే ఎక్కువమంది వ్యక్తులు రోడ్డు మీదకు రాకూడదు.మైకులు, స్పీకర్లలో పాటలు, ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగాలు వినిపించడం నిషేధం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వంటి వాటికి అనుమతి లేదు.
వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు కానీ గుర్తులు ప్రదర్శించడం నిషేధం.అంతేకాదు పోలింగ్ కేంద్రాలకు కి.మీటరు దూరంలో జెండాలు, తుపాకులు, మారణాయుధాలతో తిరగకూడదు. చివరకు ఆత్మరక్షణ కోసం కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వినియోగించడంపైన కూడా నిషేధం విధించారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని షాపులు మూసి వేయాలి. దీనిపై పోలింగ్, కౌంటింగ్ రోజున కచ్చితంగా డ్రై డేను అమలు చేయాలని ఎక్సైజ్ శాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY