
మనిషికి ఎంత డబ్బు ఉన్నా.. ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్లే. అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అనే మాటకు అప్పటికీ, ఇప్పటికీ అంతే వ్యాల్యూ ఉంది. అయితే మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కేవలం శారీరక ఆరోగ్యం ద్వారా మాత్రమే మానసిక ఆరోగ్యాన్ని సాధించలేం. దీనికోసం మంచి జీవన ప్రమాణాన్ని కలిగి ఉండటం చాలా అవసరం.ముఖ్యంగా కరోనా తర్వాత కొంతమంది ఆందోళన, డిప్రెషన్‌కు కూడా బాధితులయ్యారు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే అది ఒక రుగ్మతగా మారే అవకాశం ఉంది.
మానసికంగా ఇబ్బంది పడుతున్న వారి లక్షణాలు చాలా కాలంగా నిరాశ, నిస్పృహలకు గురవ్వడం, తరచూ భావోద్వేగానికి లోనవ్వడం, నిస్సహాయంగా లేదా బలహీనంగా అనిపించడం, ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవడం, మంచి ఫుడ్ తినడం, తాగడంపై కూడా శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఎవరినీ కలవడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడం, ఎక్కువ సమయం ఒంటరిగా గడపడం, చాలామంది ఉన్నచోట ఉండకపోవడం, నెగిటటివ్ థాట్స్‌తో ఇబ్బంది పడటం, మానసిక స్థితిలో మార్పులు రావడం, చేసే పనిపై ఆసక్తి లేకపోవడం వంటి సింప్టమ్స్ కనిపిస్తే వెంటనే వారిపై శ్రద్ధ చూపించాలి.
డిప్రెషన్ నుంచి తప్పించుకోవడానికి..ఫిజికల్ గా హెల్త్ ప్రాబ్లెమ్స్ వస్తే తగ్గించుకోవచ్చు. కానీ మానసిక సమస్యలు అలా కాదు. చికిత్స ప్రారంభించినా చాలాకాలం పడుతుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తి కూడా తన సమస్యను చెప్పడానికి ఇష్టపడడు. ఎందుకంటే తెలిసిన వారు వెక్కిస్తారని, హేళన చేస్తారని అనుకుంటాడు. అందుకే అలాంటి వ్యక్తులతో మామూలుగా మాట్లాడటం, కుటుంబ సభ్యులు అండగా నిలవడం, ధైర్యం చెప్పడం, నిత్యం ఎక్కువ మంది ఉన్న చోట ఉండేలా చేయడం అవసరం. అప్పుడే అతడు మామూలు స్థితికి వస్తాడు.
ఇలాంటివారు ప్రతిరోజు యోగా, వ్యాయామం ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ఇష్టమైన మ్యూజిక్ వినడం, హాబీలు ఏమైనా ఉంటే వాటిని డెవలప్ చేసుకుంటే మంచిది. ముందుగా డిప్రెషన్ లక్షణాలు ఏం కనిపించినా.. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లడం మంచిది. సింప్టమ్స్ ఎక్కువయితే తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తే కౌన్సిలింగ్ తోనే డిప్రెషన్ కు చెక్ పెట్టొచ్చు.లేదంటే కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు పెరిగి అనాలోచిత.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY