సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. అయితే నాగబాబును క్యాబినెట్ లోకి కను తీసుకుంటే.. శాసనమండలి నుంచి మంత్రిగా ఎన్నికైన తొలి నేతగా నాగబాబు సరికొత్త రికార్డు సృష్టిస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు శాసనమండలి నుంచి ఎవరినీ కూడా సీఎం చంద్రబాబు నేరుగా మంత్రివర్గంలోకి తీసుకోలేదు . యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఆ అవకాశం ఇవ్వలేదు. తొలిసారిగా జనసేనకు అందులోనూ జనేసేన నేత నాగబాబుకే ఈ అరుదైన అవకాశం దక్కనుంది.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు..శాసనమండలి సభ్యులుగా ఉన్న యనమల రామకృష్ణుడు, నారాయణను సీఎం చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పట్లో వారిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాకపోవడంతో.. క్యాబినెట్ కూర్పులో భాగంగా వారిద్దరికీ కూడా అవకాశం ఇచ్చారు. మరోవైపు మంత్రిగా నారా లోకేష్ కు తొలి అవకాశాన్ని ఇచ్చి ఆ తర్వాత లోకేష్‌ను ఎమ్మెల్సీ చేశారు. కానీ ఈసారి ఆ అవకాశం లేదు ఎందుకుంటే లోకేష్ మంగళగిరి నుంచి గెలవగా.. నారాయణ నెల్లూరు నుంచి విజయం సాధించారు. ఇక యనమల రామకృష్ణుడు బదులు ఆయన కుమార్తె యనమల దివ్య తుని నుంచి గెలిచారు. శాసనమండలి నుంచి ఎవరినీ కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు.
నిజానికి ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టాలని నాగబాబు అనుకున్నారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో కూటమి పొత్తులో భాగంగా నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సమన్వయ బాధ్యతలను తీసుకుని.. కూటమి గెలుపునకు కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక.. రాజ్యసభకు ఎంపికై పార్లమెంట్లో అడుగు పెట్టాలని భావించినా అదీ కుదరలేదు. ఆసమయంలో నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నిక కావడంతో త్వరలో ఆయనను మంత్రిగా తీసుకోవడం ఖాయమని తేలుతోంది.
మరోవైపు నాగబాబు కనుక మంత్రి అయితే మెగా కుటుంబం ఒక సరికొత్త రికార్డు సృష్టించినట్టే అవుతుంది. మెగా కుటుంబం ఇటు సినిమాలలోనూ..అటు రాజకీయాలలోనూ తమ సత్తా చూపించారు.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినా కూడా.. తాను అనుకున్నది సాధించలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్రమంత్రి పదవిని పొందారు. ఇక ఆతర్వాత జనసేనను ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఏకంగా ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయి.. త్వరలో మంత్రి పదవిని చేపట్టబోతున్నారు.