చంద్రగిరి, తిరుపతిలో హీటెక్కిన రాజకీయాలు

Politics Heated Up In Chandragiri And Tirupati, Politics Heated Up In Chandragiri, Heated Politics In Chandragiri And Tirupati, Heated Politics In Tirupati, Tirupati Politics, Chandragiri Politics, Campaign, Politics,Chandragiri, Tirupati, Arani Srinivasulu, Pulivarthi Nani, Vinyl, Arani Jagan, Arani Madan, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
campaign, Politics,Chandragiri, Tirupati, Arani Srinivasulu, Pulivarthi Nani, Vinyl, Arani Jagan, Arani Madan

ఏపీలో త్వరలో రానున్న ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని  చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలలో ఎమ్మెల్యే సీటును దక్కించుకోవడానికి  అధికార, ప్రతిపక్షల పార్టీలు ఆ ప్రాంతాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కుమారుడు వినీల్ తన తండ్రిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ..  గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన తండ్రి పులివర్తి నాని నిలబడుతున్నా కూడా.. తానే  ఎంఎల్ఎ అభ్యర్థి అన్నట్గుగా..వైఎస్సీర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఓడించడానికి  గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

2019  ఎన్నికల్లో తన తండ్రి పులివర్తి నానికి జరిగిన పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని ..గెలవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా వినీల్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రగిరి నియోజకవర్గానికి తన తండ్రి పులివర్తి నాని ఇస్తున్న హామీలతో పాటు  మరికొన్ని హామీలను పులివర్తి వినిల్ కూడా ఇస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.

మరోవైపు తిరుపతి నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని..ఆయన ఇద్దరు కుమారులు ఆరణి జగన్, ఆరణి మదన్ కూడా రంగంలోకి దిగి.. గెలిచే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.ఓ వైపు నుంచి కూటమి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండటంతో వారిని కూడా సముదాయిస్తూ కలుపుకొని ప్రచారాలలో దూసుకుపోతున్నారు.

తిరుపతి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్‌ని  ఓడించడానికి వీరిద్దరే ఎమ్మెల్యే అభ్యర్థి అయినట్లు ప్రచార జోరును పెంచేశారు.  భూమన అభినయ్ ప్రధాన అస్త్రంగా  ఉపయోగిస్తున్న నాన్ లోకల్ అభ్యర్థులకు ఓట్లు వేయొద్దు అన్న ప్రధాన ఆరోపణనను తిప్పికొట్టడానికి సాయ శక్తులా ప్రయత్నిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − three =