పేదల ఇళ్ల నిర్మాణానికి 4 లక్షల ఆర్థిక సాయం

The AP Government Has Decided To Provide Financial Assistance Of 4 Lakhs For The Construction Of Houses For The Poor,Financial Assistance Of 4 Lakhs For The Construction Of Houses For The Poor,AP Government Has Decided To Provide Financial Assistance,The AP Government,Financial Assistance,4 Lakhs For The Construction Of Houses,4 Lakhs ,Construction Of Houses For The Poor,AP Live Updates, AP Politics, Political News, Mango News,Mango News Telugu
AP government, financial assistance, houses, cm chandrababu naidu

గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలన లో విసుగు చెందిన ప్రజలు.. ఇప్పుడు చంద్రబాబు పాలనలో సంబరాలు చేసుకుంటున్నారు. అధికారంలోకి రావడమే ఆలస్యం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే..రాష్ట్ర అభివృద్ధి ఫై బాబు ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకదాని తర్వాత ఒకటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజలకు లబ్ది చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటూ వారిని సంతోషంలో ముంచుతుంది. తాజాగా పేదల ఇళ్ల స్థలాల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

పేదల సొంతింటి కల సాకారం చేస్తూ ఒక్కో ఇంటికి రూ.4 లక్షల సాయం ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అలాగే పట్టణాల్లో 2 సెంట్లు భూమి అందజేయబోతున్నట్లు తెలిపింది. ఇక సొంత స్థలాల్లోనూ గృహ నిర్మాణానికి అనుమతి ఇవ్వనుంది. ఏడాదిలో 8 లక్షలకు పైగా నిర్మాణాలే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేయనుంది. గతంలో ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని తమ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేసింది. అయితే లే అవుట్లు వేయని చోట కూడా ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.

అలాగే జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు అందజేయాలని  ముఖ్యమంత్రి నిర్ణయించారు. గత జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సెంటు స్థలం పంపిణీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో స్వయంగా ప్రభుత్వమే ఇళ్లు కట్టించింది. అయితే సెంటు స్థలంలో ఇళ్లు అగ్గిపెట్టెల్లా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు కనీసం రెండు సెంట్ల స్థలం అయినా పంపిణీ చేయాలని అప్పట్లో టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే మూడు సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE