ఏకంగా రూ.60 వేల కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం

The Central Government Has Approved The 60 Thousand Crore Project In Machilipatnam,60 Thousand Crore Project In Machilipatnam,Central Government Has Approved The 60 Thousand Crore Project ,Government Has Approved The 60 Thousand Crore Project,Central Government,The 60 Thousand Crore Project,Machilipatnam, Another Good News For AP, balashauri, BPCL project, Chandrababu, Machilipatnam, Port, Union Petroleum Minister Hardeep Singh Puri, Lok Sabha Elections, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu
another good news for AP,BPCL project, Chandrababu, Balashauri, Union Petroleum Minister Hardeep Singh Puri, Port, Machilipatnam

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే అధికారం చేపట్టిన కూటమి గవర్నమెంటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి వరుసగా గుడ్ న్యూస్‌లు అందుతున్నాయి. ఇప్పటికే ఏపీలో పెండింగ్‌లో ఉన్న‌ రహదారి ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులకు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిల్లీ టూర్‌లో ఉన్నప్పుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా  కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఏకంగా రూ.60 వేల కోట్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లో  ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. అంతేకాదు త్వరలోనే  ఈ ప్రాజెక్టుపై  చర్యలు ప్రారంభం కానున్నాయి.

కృష్ణాజిల్లా కేంద్రం అయిన మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయడానికి  కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అంగీకారం తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గురువారం కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటంతో దీన్ని సద్వినియోగం చేసుకుంటూ పలు ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉన్న విషయాన్ని చంద్రబాబు ..హర్దీప్ సింగ్ పూరీ దృష్టికి తీసుకురాగా.. దీనికి కేంద్రమంత్రి  ఏకీభవించారు.

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో  కలిసి చంద్రబాబు జులై 4న పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి.. బందరులో బీపీసీఎల్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం 2 నుంచి 3 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని తెలిపారు. అంతకంటే ఎక్కువగా అవసరమైతే దానికి తగినట్లుగా భూమిని కేటాయించడానికి సిద్దమని బందరు ఎంపీ బాలశౌరి కేంద్రమంత్రికి వివరించారు. దీంతో ..ఈ ప్రాజెక్టుపై త్వరలోనే  ఓ అధికారిక ప్రకటన చేస్తామని హర్దీప్ సింగ్ పూరీ బాలశౌరికి హామీ ఇచ్చారు. దీంతో నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.

నిజానికి ఈ భారీ ప్రాజెక్టుకు ముందుగా కాకినాడను కేంద్రం ఎంచుకున్నా కూడా ..బందరు  రాజధానికి దగ్గరగా ఉండటం, భూమి లభ్యత వంటి కారణాల వల్ల  బందరుకు కొత్త ప్రాజెక్టును మార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.  బీపీసీఎల్ రిఫైనరీ రాకతో రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకూ వీలు అవుతుందని బందరు ఎంపీ బాలశౌరి తెలిపారు.మొత్తంగా ఏకంగా రూ.60 వేల కోట్ల ప్రాజెక్టు  ఏపీకి రానుండటటంతో..ఆంధ్రప్రదేశ్ ప్రజలు  హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY