రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురు చూసిన ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు రోజులు దాటినా ఫలితాలపై ఇంకా చర్చలు ఆగలేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో కూటమి ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించడంతో..చర్చల హీటు చల్లారడం లేదు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో రాజకీయాలు మరింత హీటెక్కాయని చెప్పొచ్చు.
ప్రస్తుతం జనసేనాని పోటీ చేసిన పిఠాపురంకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం గురించి ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తేలింది. గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం 30 రోజులుగా పిఠాపురం అనే ట్యాగ్ యూఏఈ, యూఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలన్నింటిలో ఎక్కువ మంది సెర్చ్ చేశారు అని గూగుల్ ట్రెండ్స్ డేటాలో తేలింది.
అలాగే ప్రస్తుతం పిఠాపురం అనే ట్యాగ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది అని గూగుల్ స్పష్టం చేసింది. దీంతో దీనికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ అని, జనసేనాని కోసమే ప్రజలు పిఠాపురం గురించి అంతలా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన పవన్ కళ్యాణ్ .. ఈ పదేళ్లు కూడా ఎంత కష్టపడ్డారో అంతా అర్ధం చేసుకున్నారని అందుకే పవన్ పై ప్రపంచవ్యాప్తంగా అభిమానం పెరిగినట్లు చెబుతున్నారు. దీనికి తోడు 2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న పవన్ గెలుపు కోసం రాత్రి పగలు శ్రమించడాన్ని జనాలు అర్ధం చేసుకున్నారని అంటున్నారు. పవన్ కష్టానికి తగిన ఫలితంగా కూటమి భారీ విజయంతో అధికారంలోకి వచ్చిందని.. అటు విశ్లేషకులతోపాటు,రాజకీయ నేతలు, ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY