ఎన్నికల ముందు.. ఎన్నికలయిపోయాక పార్టీ ఫిరాయింపులు అనేది సర్వసాధారణం. టికెట్ దక్కక.. నచ్చిన చోట టికెట్ ఇవ్వలేదని కొందరు పార్టీ ఫిరాయిస్తుంటారు. మరికొందరు తమ పార్టీ అధికారం కాల్పోయిందని.. ఎన్నికలయిపోయాక అధికార పార్టీలోకి జంప్ అవుతుంటారు. ఇది సర్వసాధారణ ప్రక్రియే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. గతంలో 151 స్థానాలను దక్కించుకున్న వైసీపీ.. ఈసారి కేవలం 11 స్థానాలకే పరిమితమయింది. అధికారాన్ని కోల్పోయింది. ఈక్రమంలో వైసీపీ పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు.. ఎంపీలతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా అధికార పక్షంలోకి జంప్ అయ్యేందుకు పావులు కదుపుతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలు కాషాయపు కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ వారు ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ వైసీపీ నేతలు అధికార పక్షంలోకి జంప్ అవ్వబోతున్నారనే ప్రచారానికి చెక్ పడడం లేదు. తాజాగా వైసీపీకి చెందిన మరో కీలక నేత బీజేపీ వైపు చూస్తున్నారని.. త్వరలోనే ఆయన కాషాయపు కండువా కప్పుకోబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అయిన బుగ్గన రాజేంద్ర నాథ్ వైసీపీకి త్వరలో గుడ్ బై చెప్పనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లారని.. ఆయన్ను చేర్చుకునేందుకు అటు బీజేపీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ప్రస్తుతం బుగ్గనకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించింది. బుగ్గన రాజేంద్రనాథ్ పార్టీ మారబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. అది తప్పుడు వార్త అని .. కొందరు కావాలని వైసీపీ నేతలపై ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారని పేర్కొంది. బుగ్గన రాజేంద్రనాథ్ పార్టీ మారడం లేదని.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. అయితే వైసీపీ నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు చూస్తున్నారంటూ వస్తున్న వార్తలను వైసీపీ నేతలు ఖండిస్తున్నప్పటికీ.. ఆ వార్తలకు మాత్రం అడ్డు కట్ట పడడం లేదు. రోజుకో కొత్త వార్త పుట్టుకొస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE