ఏపీలో ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని డియా మెటియోరాలజికల్ డిపార్ట్‌మెంట్ ,ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అంచనా వేసింది. మార్చి, ఏప్రిల్, మే.. ఈ మూడు నెలలు ఎండలతోపాటు, వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఎల్‌నినో ప్రభావం వల్ల వడగాలుల తీవ్రత కూడా పెరగొచ్చు. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4–5 డిగ్రీలు అధికంగా ఉండొచ్చని, జూన్ మొదటి వారం వరకు 45 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉంటుందని తెలిపింది.
గతేడాది మార్చి 4 నాటికి అనంతపురంలో 39.9 డిగ్రీలు, కర్నూల్‌లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఎక్కువ తీవ్రత ఉండొచ్చని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ , వాతావరణ శాఖ అంచనా వేస్తున్నాయి. వేడిగాలులు, ఎండ తీవ్రతపై రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ రెండు రోజుల ముందుగానే జిల్లా అడ్మినిస్ట్రేషన్‌కు సూచనలు ఇస్తుంది. మరోవైపు ఎండలు, వేడి గాలుల తీవ్రత వల్ల ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రాకుండా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఇంట్లోనే ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ నివారణకు ఓఆర్‌ఎస్, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లుతో పాటు వాటర్ ఎక్కువగా తాగాలని సలహా ఇచ్చారు.
2016లో 723, 2017లో వడగాలుల వల్ల 236 మంది చనిపోయారు. 2020–2022లో ఒక్క వడగాల్పుల మరణం లేదు. 2023లో ముగ్గురు చనిపోయారు. అయితే, ఈ ఏడాది మార్చి నుంచే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ చెబుతూ ..దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మొత్తంగా వచ్చే మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వడగాలులు తీవ్రంగా ఉండనుండటంతో దీనికి తగ్గట్లు ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్లు తీసుకోవాలని కోరుతోంది.