ఏపీ కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీ పెద్దల పట్ల సీనియర్ లీడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పట్ల.. పలువురు సీనియర్ నేతలు ఆగ్రహంతో ఉన్నారట. ఇప్పటికే పలువురు సీనియర్ లీడర్లు బహిరంగంగానే షర్మిలపై కామెంట్లు చేశారు. మీడియా ముందుకు వచ్చి షర్మిల తీరు.. వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలవేళ వైఎస్ షర్మిల ఒంటెద్దు పోకడలకు పోయారని.. పార్టీ కోసం కంటే స్వలాభం కోసం ఆమె పని చేశారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలు ఆరోపించారు. షర్మిల తీసుకున్న సొంత నిర్ణయాల వల్లే పార్టీకి తీవ్ర డ్యామేజీ జరుగుతోందని.. ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కూడా షర్మిల తీసుకున్న నిర్ణయాలే కారణమని వారు ఆరోపించారు.
వారే కాకుండా ఏపీ కాంగ్రెస్‌లో చాలా మంది సీనియర్ నేతలు, జూనియర్ నేతలు షర్మిల వ్యవహాశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. షర్మిల ఒంటెద్దు పోకడలు వెళ్లడం.. ఆమె తీసుకునే నిర్ణయాల పట్ల పార్టీ లీడర్లంతా సంతృప్తిగా లేరని తెలుస్తోంది. ఎన్నికలప్పుడు కూడా సమర్థులయిన నేతలకు టికెట్లు ఇవ్వకుండా.. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని షర్మిలపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎన్నికలవేళ అక్కడి నుంచి ఏపీ కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున నిధులు వచ్చాయట. అయితే ఆ నిధులను కూడా షర్మిల దారి మళ్లించారని.. ఖర్చు చేసిన వాటికి లెక్కలు కూడా సరిగా లేవని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని నిధులు మిగిలాయనే విషయాన్ని కూడా షర్మిల చెప్పడం లేదని అంటున్నారు.
ముందు నుంచి కూడా హైకమాండ్ అండతో షర్మిల.. పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఒంటెద్దు పోకడలు పోతోందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో షర్మిల తీరు వల్ల కొందరు నేతలు పార్టీ మారేందుకు కూడా సిద్దమయినట్లు తెలుస్తోంది. ఎన్నికలప్పుడు వైసీపీలో టికెట్ దక్కలేదని కొందరు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే కొందరు మాజీ కాంగ్రెస్ నేతలు కూడా తిరిగి సొంతగూటికి వచ్చారు. అయితే ఇప్పుడు షర్మిల తీరు వారికి ఏమాత్రం నచ్చలేదట. అలాగే పార్టీలో వారికి తగిన ప్రాధాన్యత కూడా లేదని నేతలు భావిస్తున్నారట. అందుకే పార్టీ మారేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి ఎవరెవరు పార్టీ మారుతారనేది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY