16 మంది ఎంపీలతో కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో కీలకంగా మారింది తెలుగు దేశం పార్టీ. గత ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలతో పార్లమెంట్‌లో వెనుక బెంచ్‌కు పరిమితమయిన టీడీపీ.. ఇప్పుడు 16 మంది ఎంపీలతో ఫస్ట్ బెంచ్‌కు వచ్చేసింది. ఇదే సమయంలో గత ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. తద్వారా లోక్‌సభలో నాలుగో పెద్ద పార్టీగా నిలిచింది. కానీ ఈసారి వైసీపీ వ్యూహాలన్నీ బెడిసి కొట్టి.. కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమయింది.
ఈసారి పార్లమెంట్‌లో దేశవ్యాప్తంగా 41 పార్టీలకు చెందిన ఎంపీలు అడుగుబెట్టబోతున్నారు. లోక్‌సభలో 240 మంది ఎంపీలతో భారతీయ జనతా పార్టీ అత్యధిక మంది ఎంపీలు కలిగిన పార్టీగా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 99 మంది ఎంపీలతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. సమాజ్ వాదీ పార్టీ ఈసారి 37 స్థానాలను దక్కించుకొని.. లోక్‌సభలో మూడో స్థానంలో నిలిచింది. 29 మంది ఎంపీలతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానంలో.. 22 మంది ఎంపీలతో డీఎంకే పార్టీ అయిదో స్థానంలో ఉంది.
ఇక ఈసారి తెలుగు దేశం పార్టీ 16 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో 16 మంది ఎంపీలతో పార్లమెంట్‌లో టీడీపీ ఆరవ స్థానంలో నిలిచింది. ఇక పోయినసారి 22 మంది ఎంపీలతో లోక్ సభలో నాలుగో స్థానంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి నలుగురు ఎంపీలతో 15వ ప్లేస్‌కు చేరుకుంది. అయితే 1984 నుంచి తెలుగు దేశం పార్టీ జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ వస్తోంది. 1984లో తొలిసారి టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది. 1986లో 30 మంది ఎంపీలతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో.. 1999లో 35 మంది ఎంపీలతో వాజ్ పేయ్ ప్రభుత్వంలో తెలుగు దేశం పార్టీ కీలక పాత్ర పోషించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE