ఏ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుంది?

Who Will Win In Keshineni Brothers..?, Keshineni Brothers, Who Will Win, Keshineni Brothers, Keshineni Nani, Keshineni Chinni, TDP, YCP, Janasena, Pawan Kalyan, Chandrababu, CM Jagan, BJP, Congress, YSRCP, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Keshineni Brothers,Keshineni Nani, Keshineni Chinni, TDP, YCP, Janasena, Pawan Kalyan, Chandrababu, CM Jagan, BJP, Congress, YSRCP

ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో.. ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రానికి మంచిది?. ఏ అభ్యర్థి గెలిస్తే ఏ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ముఖ్యంగా అధికార వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు  ఏపీ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తాయనే విషయాలను చర్చిస్తూనే..  ఆయా ప్రాంతంలో పోటీ చేసే వ్యక్తులలో ఎవరయితే తమకు మంచి చేస్తారనే దానిపై దృష్టి పెట్టారు. ఇలా  ఎంపీ స్థానాలలో  పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి  కొన్నింటిపై ఏపీ వ్యాప్తంగా  ఆసక్తిని కనబరుస్తుంది.

ముఖ్యంగా విజయవాడ ఎంపీ స్థానం గురించి కృష్ణా జిల్లాలోనే కాకుండా వివిధ ప్రాంతాలలో  చర్చ జరుగుతోంది. విజయవాడలో  కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు మొదటి నుంచీ కూడా  మంచి క్రేజ్ ఉంది. కొన్ని దశాబ్దాలుగా  పార్టీ ఏదయినా సరే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే టికెట్‌ను కేటాయిస్తూ వస్తుంది. త్వరలో రానున్న ఎన్నికల కోసం ..ఈ సారి కూడా ఈ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ కేటాయిస్తున్నారన్న వార్తలతో..అభ్యర్థుల  మధ్య రసవత్తర పోరు ఉండబోతుందన్న ప్రచారం జరుగుతోంది.

విజయవాడ ఎంపీ  స్థానంలో కేశినేని బ్రదర్స్ మధ్య భారీ ఎత్తున పోటీ  నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి  విజయవాడ ఎంపీ స్థానంలో వరుసగా రెండు సార్లు గెలిచిన కేశినేని నాని.. ఆ తర్వాత వైఎస్సార్సీపీలోకి  జంపయ్యారు. ఈ సారి నాని వైఎస్సార్సీపీ నుంచి విజయవాడ ఎంపీ స్థానంలో  టీడీపీ అభ్యర్ధికి సవాల్ విసరబోతున్నారు.

ఇకపోతే  విజయవాడ ఎంపీ  స్థానంలో గెలవాలంటే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. కమ్మ సామాజిక వర్గానికి ఈ ప్రాంత వాసులు ఎంత పెద్ద పీఠ వేస్తారో..  టీడీపీని కూడా అంత ఎక్కువ గుండెళ్లో పెట్టుకుంటారు. ఈ లెక్కలతోనే  గడిచిన రెండు పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడి నుంచి  టీడీపీ అభ్యర్ధిగా  పొటీ చేసిన కేశినేని నానికి విజయాన్ని అందించారు. అలా టీడీపీ నుంచి గెలిచిన కేశినేని వైసీపీ కండువా కప్పుకోవడంతో రాజకీయ సమీకరణాలు  ఒక్కసారిగా మారిపోయాయి.

దీనికి తోడు ఈ సారి రానున్న ఎన్నికలలో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ స్థానంలో పోటీ  చేయబోతున్నారు. కేశినేని నాని వైసీపీలోకి వెళ్లిపోవడంతో.. టీడీపీ సీటు విషయంలో  చాలా కష్టాలు పడాల్సి వస్తుందని అనుకున్నారు. కానీ  కేశినేని నానికి బదులు.. ఆయన సోదరుడు  కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని తెలుగు దేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికితోడు టీడీపీ తరపున  చిన్ని పోటీ చేయబోతుండంతో  అక్కడ  వీరిద్దరికీ  మంచి పట్టు ఉండడం..వీరిద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన  వ్యక్తులు కావడంతో ఈ ప్రాంత ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =