
ఎండాకాలంలో చల్లచల్లని బీర్లకు యమా డిమాండ్ ఉంటుంది. దీనికితోడు మిగిలిన సీజన్స్‌తో పోలిస్తే సమ్మర్‌లో ఆల్కహాల్ తాగేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇలాంటి వారికి తాజాగా ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వైన్స్ షాపులన్నీ మూతపడనున్నాయి.
మే 13న జరిగే ఎన్నికలలో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాలన్నిటినీ మూసివేయాలని ఈసీ అధికారులు ఆదేశించారు. సాధారణంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను జరపడం కోసం పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలన్నిటిని మూసివేస్తూ ఉంటారు.
ఈ నెల 13న ఎన్నికల జరగనుండటంతో మే 11 సాయంత్రం 7 గంటల నుంచి మే 13 సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయమని ఈసీ అధికారులు ఆదేశించారు. ఈ రెండు రోజులతో పాటు ఎన్నికల కౌంటింగ్ జరిగే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
ఈ ఎన్నికల్లో మద్యం పంపిణీని అడ్డుకోవాలనే ఉద్దేశంతో పాటు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించాలనే నిర్ణయంతో ఎన్నికల సమయంలో మద్యం దుకాణాలు మూసివేస్తుంటారు. పోలింగ్‌కు 48 గంటల ముందు అనగా.. ప్రచారం ముగిసేరోజు నుంచి వైన్ షాపులు మూసేస్తారు. దీంతో మొత్తం మూడు వారాల గ్యాప్ లోనే మూడురోజుల పాటు డ్రైడే ఉండనుంది.
మరోవైపు ఏపీలో మే 13 న జరగనున్న ఈ ఎన్నికల్లో అధికార వైసీపీతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లలో బరిలో దిగగా.. భారతీయ జనతా పార్టీ 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తోంది. జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో పోటీ పడుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY