ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 16, శనివారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2205 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 9,628 సాంపిల్స్ ని పరీక్షించగా 48 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు.
ఏపీలో కొత్తగా నెల్లూరు, కర్నూల్, గుంటూరు జిల్లాలలో 9 కేసులు చొప్పున, చిత్తూరులో జిల్లాలో 8, కృష్ణాలో 7, విశాఖపట్నంలో 4, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కో కేసు చొప్పున మొత్తం 48 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే నెల్లూరులో 9, కర్నూల్ లో 9, చిత్తూరు జిల్లాలో 8, విశాఖపట్నంలో 2, కడప, గుంటూరు, పశ్చిమ గోదావరి లలో ఒక్కో కేసుతో కలిపి మొత్తం 31 కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చినవిగా చెప్పారు. ఇక ఈ వైరస్ వలన ఇప్పటివరకు 49 మంది మృతి చెందగా, మరో 1353 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లోనే 101 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ఇక ప్రస్తుతం 803 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 150 (మహారాష్ట్ర 101, గుజరాత్ 26, రాజస్థాన్ 11, ఒడిశా 10, పశ్చిమ బెంగాల్ 1, కర్ణాటక 1) మందికి కరోనా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మే 15, శుక్రవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,454 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 33 మందికి, వలస వచ్చిన వారికీ 7 మందితో కలిపి మొత్తం 40 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు తెలిపారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 34 మంది మృతి చెందగా, 959 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 461 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)
* 9,628 సాంపిల్స్ ని పరీక్షించగా 48 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
* 101 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు.#APFightsCorona pic.twitter.com/8HOO8GDLKd— ArogyaAndhra (@ArogyaAndhra) May 16, 2020
Media bulletin
Date: May 15, 2020Status of positive cases of #COVID19 and also a list of districts with zero active cases in Telangana. pic.twitter.com/gx96s6Yvqd
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 15, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu