ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించినట్లు ఆయన చెప్పారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు కాగా.. మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు అని తెలిపారు. ద్రవ్యలోటు 68,743 కోట్లు అని తెలిపారు. అంతకముందు 2024-25 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందు ఉంచారు. శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌ను రెండుసార్లు ఆమోదింపజేసుకొని నిధులు ఖర్చు చేస్తున్నారు.
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలు పాతరేశారని దుయ్యబట్టారు. తమ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నీ రంగాలను దృష్టిలో పెట్టుకొని పరిపూర్ణమైన బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వానికి 93 శాతం మంది ప్రజలు మద్దతు పలికారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవంతో సీఎం చంద్రబాబు ఏపీలో అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
బడ్జెట్ కేటాయింపులు..
పోలీస్ శాఖ- రూ.8495,
ఎస్సి సంక్షేమం-రూ.18,497
నైపుణ్యాభివృద్ది-రూ.12,015కోట్లు
పాఠశాల విద్యాశాఖ-రూ.29090 కోట్లు
ఉన్నత విద్య-రూ.రూ.2326 కోట్లు
పంచాయితీ రాజ్-రూ.16739కోట్లు
గృహనిర్మాణం-రూ.412కోట్లు
ఇంధన రంగం-రూ.8207కోట్లు
రోడ్లు, భవనాలు-రూ.9554
పర్యావరణం, అటవీశాఖ-రూ.6087 కోట్లు
బీసీ సంక్షేమం- రూ.39,007కోట్లు
మహిళా శిశు సంక్షేమం-రూ.4285కోట్లు
ఆరోగ్యం- 18421 కోట్లు
జనవనరులు- 16,705 కోట్లు
పరిశ్రమలు-3127కోట్లు
టూరిజం,రంగానికి-రూ.322 కోట్లు
ఎస్టీ సంక్షేమం- . కోట్లు
మైనార్టీకి సంక్షేమం-రూ.4376 కోట్లు