ఏపీ ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత దీక్షలో భాగంగా.. పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.వెంకన్న దర్శనం కోసం ముందుగా అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకోబోతున్నారు.సాయంత్రం 5 గంటలకు కాలినడకన అలిపిరి మార్గంలో పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్లనున్నారు.
అక్టోబర్ 2 వ తేదీ రాత్రి 9 గంటలకు పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకోబోతున్నారు. అక్టోబర్ 3వ తేదీ ఉదయం 8:15 నిమిషాలకు శ్రీవారిని పవన్ కల్యాణ్ దర్శించుకోబోనున్నారు. దర్శనం తర్వాత 3వ తేదీ ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల వరకు అన్నదానం సముదాయంతో పాటు క్యూలైన్లను కూడా పవన్ కల్యాన్ తనిఖీలు చేయనున్నారు.
అక్టోబర్ 3 వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు. అదే రోజు రాత్రి 8:30 గంటలకు తిరిగి.. రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరంకు పవన్‌కల్యాణ్ బయలుదేరి వెళ్లనున్నారు.
మరోవైపు పవన్ చేస్తున్న పనులను చూస్తున్న కొంతమంది సెలబ్రెటీలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పవన్ లాంటి రాజకీయ నాయకులు ఎంతోమంది రావాలని డైరక్టర్ కృష్ణవంశీ ట్వీట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ తర్వాత అలాంటి విలువలు, తెలివితేటలు ఉన్న ప్రత్యేక రాజకీయవేత్త పవన్ అంటూ కృష్ణవంశీ ప్రశంసలు కురిపించారు. కృష్ణవంశీ కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి.