ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం లను కాన్సెప్ట్‌ సిటీలుగా రూపకల్పన

Anantapur, Andhra CM proposes to create concept cities, AP Govt Plans Concept Cities in Visakhapatnam, concept cities in AP, Govt plans concept cities in Vizag, IT concept cities in Vizag, Three concept cities in Andhra Pradesh, Tirupati, Visakhapatnam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా కాన్సెప్ట్‌ సిటీలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలను కాన్సెప్టు సిటీలుగా రూపకల్పన చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నగరాలను అభివృద్ధి చేయనున్నారు. కనీసం 2000 ఎకరాల్లో కంపెనీలు వచ్చి పనిచేసుకుని వెళ్లే విధంగా వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో కొంత ప్రాంతం ప్రత్యేక ఆర్ధిక మండలి(సెజ్) గానూ, మరికొంత నాన్ సెజ్ గానూ ఉండనుంది. అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసి, ప్రపంచ దేశాలను ఆకర్షించేలా అనంతపురం, విశాఖపట్నం, తిరుపతి నగరాలను తీర్చిదిద్దనున్నారు. మరోవైపు కాన్సెప్ట్‌ సిటీ ప్రణాళిక, ఆర్ధిక విధానం రూపకల్పన కోసం రూ.84.85 లక్షలు విడుదల చేయడానికి అనుమతి ఇస్తూ శుక్రవారం నాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here