భక్తులు ఎంతగానో ఎదురుచూసే శ్రీవారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానుండగా..ఇటు ఇంద్రకీలాద్రి అమ్మవారి శరన్నవరాత్రులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి జరగనున్నండటంతో టీటీడీ అధికారులు ఇప్పటికే తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.
ఇవాళ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. మరోవైపు రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగనుండటంతో..రేపు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వారి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే పెద్ద శేష వాహన సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. 12వ తేదీ రాత్రి ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఇంద్ర కీలాద్రిపై ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దుర్గ గుడి ఈఓ రామారావు బుధవారం ఒక ప్రకటన చేశారు. దుర్గగుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకూ అంతరాలయ దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. ఈ పది రోజులు కూడా పది అవతారాల్లో బెజవాడ కనకదుర్గ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని దుర్గ గుడి ఈఓ రామారావు చెప్పారు.