వణికి పోతోన్న ఏజెన్సీ ప్రాంతం

Torrential Rain In Eluru District,Torrential Rain , Eluru District, CM Chandrababu Midnight Review,Chandrababu Midnight Review, Trembling agency area,IMD Issues Heavy Rain,Eluru, AP,Current Weather,Eluru Weather Forecast,Lok Sabha Elections, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu
CM Chandrababu Midnight Review,Torrential rain in Eluru district,Trembling agency area

కొంచెం కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో.. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతవాసులు వణికి పోతున్నారు. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలతో.. కొండలు,వాగులు పొంగుతున్నాయి.వరద నీరు రహదారుల పైకి రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

మరోవైపు పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి 29 మీటర్లు దాటిపోయింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు.. ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో.. జంగారెడ్డిగూడెం నల్లజర్ల తాడేపల్లిగూడెం నిడదవోలు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటిమునుతున్నాయి. జల్లేరు, తమ్మిలేరు జలాశయాలకు కూడా వరద నీటి ప్రవాహం క్రమంగా పెరిగిపోతుంది.

మరోవైపు అతి భారీ వర్షాలకు గురువారం.. ఏజెన్సీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ ఆలయం సమీపంలో కొండ వాగులు పొంగడంతో కొంతమంది భక్తులు ఆలయంలో చిక్కుకుపోయారు. ఆ భక్తులను ఆలయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇక ఇటు ఏలూరు జిల్లాలోని ముంపు మండలాలు అయిన వేలేరుపాడు కుక్కునూరు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చేరడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఏలూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద తీవ్రతపై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అర్ధరాత్రి సమీక్ష నిర్వహించారు.

ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలు, ఇతర అధికారులతో  లేట్ నైట్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. వరద పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని సూచించిన ఏపీ సీఎం.. సాధ్యమైనంత వరకు పంట నష్టాన్ని కలిగించడకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ..ఎమెర్జెన్సీ టైమ్ లో అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలని  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY