అందరికీ ఫ్యాన్స్ ఉంటే పవన్ కళ్యాణ్‌కు మాత్రం భక్తులు ఉంటారనే మాట తరచూ పవర్ స్టార్ అభిమానుల గురించి వింటూనే ఉంటాం. అయితే సినిమాల్లోనే కాదు..రాజకీయాలలోనూ పవన్ కళ్యాణ్‌కు అంతే క్రేజ్ ఉందన్న సంగతి ఇప్పుడు ఏపీలోని ప్రతి ఒక్క లీడర్ ఒప్పుకునేలా చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ తతంగం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనగా నేను అంటూ నామినేషన్ వేసిన పవన్ ఫోటోలు, వీడియోలు సీఎం ప్రమాణ స్వీకారోత్సవం రేంజ్‌లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఇన్ స్టాగ్రామ్, యూ ట్యూబ్, ఫేస్ బుక్, ఎక్స్ ఇలా ఏ ప్లాట్ఫామ్ అయినా పవన్ హవాతో నిండిపోయింది.
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. పవన్ కళ్యాణ్ వార్తలు తప్ప వేరే ఇంకేమైనా కనిపిస్తే ఒట్టు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయడంతో పిఠాపురం జనసంద్రంగా మారిపోయింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనగా నేను అంటూ.. భగవంతుని మీద ప్రమాణం చేసి జనసేనాని నామినేషన్ దాఖలు చేయడంతో అభిమానులు ఉత్సాహం పీక్స్ కు వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ర్యాలీలు, ఆయన పేరుతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. భానుడు భగభగలు కూడా ఖాతరు చేయకుండా .. పవన్ కళ్యాణ్ ర్యాలీ మొదలుపెట్టిన దగ్గర నుంచి నామినేషన్ వేసి తిరిగి వెళ్లే వరకు అభిమానులు కారు వెనుక పరుగులు తీస్తూనే ఉన్నారు.
అసలు ఇది నామినేషన్ ప్రక్రియలా లేదంటూ.. సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజులా ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. అవును పవన్ సీఎంగా గెలిచి బయటకు వచ్చినప్పుడు అభిమానులు చేస్తున్న ఆనందహోలా ఉందని మరికొందరు అంటున్నారు. అభిమానులు మాత్రమేకాదు నాగబాబు, మెహర్ రమేష్, బన్నీ వాసు, హైపర్ ఆది, జబర్దస్త్ గ్యాంగ్, గబ్బర్ సింగ్ గ్యాంగ్.. ఇలా ప్రతి ఒక్కరు పవన్ సపోర్ట్ చేస్తూ.. నామినేషన్ వేయడానికి పవన్ వెంట ర్యాలీగా వెళ్లారు.
సాధారణంగా ఏ రాజకీయ నేత నామినేషన్ వేసినా.. లేదా పెద్ద స్టార్ అయినా కూడా మహా అయితే 3,4 గంటలు ట్రెండింగ్ లో ఉంటారు. కానీ, అన్ని ప్లాట్పామ్స్ తో పాటు..మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ కూడా ఎక్స్ లో PawanKalyanWinningPithapuram టాప్ ట్రెండింగ్ లో కొనసాగడంతో ఎక్స్ ప్లాట్పామ్ షేక్ అయింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాం.జనసేనకు ఓటు వేయండి అంటూ నినాదాలతో, పవన్ వీడియోలతో సోషల్ మీడియా మారు మ్రోగిపోయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY