సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు చేస్తున్నాం, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటన

Mango News, Tirumala, Tirumala Tirupati Devasthanams, Tirupati, Traditional Meal Programme Cancelled in Tirumala, TTD Chairman YV Subba Reddy, TTD Chairman YV Subba Reddy Says Traditional Meal Programme Cancelled, TTD Chairman YV Subba Reddy Says Traditional Meal Programme Cancelled in Tirumala, TTD News, TTD withdraws Sampradaya Bhojanam

తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం ఆలయ వెలుపల టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పాలక మండలి లేనప్పుడు అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనంపై నిర్ణయం తీసుకున్నారని, అయితే అధికారులతో చర్చించి సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేస్తామని చెప్పారు. కొండపై భక్తులకు అందించే ఏ ఆహారమైన ప్రసాదంగానే అందించాలని, భక్తుల నుంచి నగదు తీసుకోవడం సరైనది కాదుని అన్నారు. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ భోజనాన్ని నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్టు వివరించారు. మరోవైపు సర్వదర్శనం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని, అధికారుల హామీ మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ