ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్‌లు అందించేందుకు ప్రణాళికలు

AP Govt Plans To Provide Electric Bikes For Employees in Soon on EMI Basis, AP Govt To Provide E-Bike For Employees, E-Bike For AP Govt Employees, Electric Bikes For Govt Employees, Mango News, Mango News Telugu, AP Govt Employees, Electric Bikes For AP Employees , Electric Bikes , E-bikes For Govt Employees, AP Electric Vehicle Scheme 2022, Electric Vehicle Subsidy In Andhra Pradesh, Electric Vehicles For Govt Employees, AP Govt Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇ-వెహికల్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్‌లను అందించాలని యోచిస్తోంది. ఈ మేరకు త్వరలో వాయిడ్ల (ఈఎంఐ – ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్) పద్దతిలో వీటిని అందించటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా గుర్తింపు పొందిన ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులకు కూడా వీటిని అందించనున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఈఆర్డీ) ఆధ్వర్యంలో పథకం రూపకల్పన చేశారు. కాగా ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఎటువంటి డౌన్ పేమెంట్ చేయనవసరం లేదు. అలాగే 60 నెలల వరకు వాయిదాల పద్దతిలో ఈ మొత్తం చెల్లించేలా అవకాశం కల్పిస్తున్నారు.

రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దీనిని ప్రోత్సహించనుండగా, విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గించుకోవడానికి ద్విచక్ర వాహనదారులకు ఇది ఒక ప్రత్యామ్నాయంగా ఉండనుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్‌లకు 3 గంటలపాటు ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. కాగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 73 ప్రాంతాల్లో మరో 400 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రధాన కూడళ్లకు దగ్గరగా ఉండే ఖాళీ స్థలాలను ఎంపిక చేయనుంది. మరోవైపు ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లు మరియు హైడ్రోజన్ ఉత్పత్తి, ఇంధనం నింపే మౌలిక సదుపాయాలకు కూడా ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 4 =