కచ్చితంగా అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం:పవన్

We Will Definitely Share In Power Pawan,Share In Power Pawan, Chandrababu,BJP,Jagan,Janasena, Pawan Kalyan,TDP,Ysrcp,Assembly Elections, Lok Sabha Elections, Polling In AP, Andhra Pradesh Assembly Polls, Exit Polls, AP Election Counting, AP Election Results 2024, AP Election 2024 Highlights, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu
definitely share in power: Pawan,TDP, Janasena, BJP, YSRCP, Pawan Kalyan, Chandrababu, Jagan

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏపీలోని అధికారంలో భాగస్వామ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి బయలుదేరే ముందు జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆత్మీయ సమావేశమైన పవన్‌ కళ్యాణ్.. పిఠాపురంలో తన గెలుపు కోసం కృషి చేసిన వర్మను అభినందిస్తూ తీర్మానం చేసారు. ఈ సమావేశంలో వర్మను ఆలింగనం చేసుకున్న పవన్‌ కళ్యాణ్ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్ భారీ మెజార్టీ సాధించినందుకు వర్మ..  పవన్‌కు శాలువా కప్పి సన్మానించారు.

అయితే ఈ ఎంపీలు, ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా జనసేన  అసెంబ్లీలో అడుగుపెట్టబోతోందని..అలాగే అధికారంలోనూ  భాగస్వామ్యం కచ్చితంగా తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు.  అయితే  రెండింటి మధ్య సాంకేతిక అంశాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుందని అన్నారు.

మరోవైపు త్వరలోనే  జనసేన పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి రాబోతోందని చెప్పారు. 24 గంటలు పార్టీ కార్యాలయం అందరికీ అందుబాటులో ఉండేలా పని చేయాలనేది తన కోరిక అని… అర్థరాత్రి, అపరాత్రుళ్లు కూడా జనసేన సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.

ఇక, త్వరలో  ఏర్పాటు కాబోయే తమ  ప్రభుత్వం .. విద్యా, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు, శాంతి భద్రతలపై ప్రత్యేక ఫోకస్ పెడుతోందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఢిల్లీ వెళ్లి వచ్చాక లెజిస్లేటీవ్ మీటింగ్ పెట్టుకుందామని..అన్నారు. ఆంధ్రప్రదేశ్  ఇప్పుడు దేశానికి అత్యంత  కీలకమైందని పవన్ చెప్పారు. అందరి సహకారంతో పోటీ చేసిన అన్ని సీట్లనీ గెలిచామన్న పవన్ కళ్యాణ్.. పోటీ చేసిన అన్నీ సీట్లను గెలిచిన పార్టీ ఇప్పటి వరకు లేను లేదన్నారు. దేశంలో ఇలాంటి విజయాన్ని దక్కించుకుంది జనసేన పార్టీ మాత్రమే అన్నారు. ప్రజలు బలమైన మార్పును కోరుకోబట్టే ఇలాంటి తీర్పు ఇచ్చారని  జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY