వైద్యుల సూచనల మేరకు తారకరత్నను బెంగళూరుకు తరలిస్తాం – టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

TDP MLA Nandamuri Balakrishna Says We will Shift Taraka Ratna To Bengaluru with Doctors Suggestions,Yuvagalam Padayatra,Actor Tarakaratna Falls Ill,Tarakaratna Shifted To Hospital,Mango News,Mango News Telugu,Yuvagalam Padayatra 2 0 Route Map,Maha Padayatra Route Map,Yuvagalam Padayatra Route Map,Maha Padayatra,Maha Padayatra Live,Maha Padayatra 2.0 Route Map,Maha Padayatra Route,Amravati Maha Padayatra,Amaravathi Maha Padayatra Route Map,Yuvagalam Farmers Maha Padayatra,Amravati Maha Padayatra Route Map,Yuvagalam Farmers Maha Padayatra Route Map,Yuvagalam Maha Padayatra,Mahatma Gandhi Padayatra

ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ నేతృత్వంలో తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కుప్పం పట్టణంలోని పీఇఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తారకరత్న ఆరోగ్యంపై ఆరా తీశారు. పార్టీ నేతలతో పాటు వైద్యులతో కూడా మాట్లాడి తారకరత్నకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ క్రమంలో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, తారకరత్న బాబాయి నందమూరి బాలకృష్ణ ఆయన ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి చేరుకున్న బాలకృష్ణ తారకరత్నను పరామర్శించి, వైద్యులతో మాట్లాడారు.

అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అయితే గుండెలోని ఎడమ వైపు రక్తనాళాలు 90శాతం మూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారని, అందుకే వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం బెంగళూరుకు తరలించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. విమానంలో తీసుకెళ్లాలా? లేక రోడ్డు మార్గంలో అంబులెన్సులో తరలించాలా? అని ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, దేవుడి ఆశీర్వాదంతో, అభిమానుల దయతో తారకరత్న త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తారకరత్న గురువారం బాలకృష్ణతో కలిసి హిందూపురంలో టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం పాదయాత్రలో పాల్గొనేందుకు ఈరోజు కుప్పం చేరుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =