ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ వడివడిగా ఏర్పాట్లు చేస్తోంది. నరేంద్ర మోదీ ఆదివారం 6 గంటలకు మూడో సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. జేపీ నడ్డా నివాసంలో సమావేశమైన పార్టీ కీలక నేతలు, ఎంపీలు ఈమేరకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్చుపై చర్చించారు. ఏయే పదవులు తమ వద్ద ఉంచుకోవాలి.. మిత్రపక్షాలకు ఏం ఇవ్వాలి.. అనే దానిపై సమావేశంలో చర్చించారు. కీలక పదవులు తమ వద్దే ఉంచుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరపడడంతో బీజేపీకి మిత్రపక్షాల సహకారం తప్పనిసరిగా మారింది. ఇది ‘మోదీ గ్యారెంటీ’ అని పదే పదే హామీ ఇచ్చానా.. బీజేపీని మాత్రం మేజిక్ మార్కును దాటలేదు. ఫలితంగా.. ఈసారి కేంద్రంలో నిజమైన సంకీర్ణ సర్కారు తప్పనిసరి అయింది.
కేంద్రంలో 18వ లోక్‌సభ కొలువుదీరడానికి ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. వీటిలో 240 సీట్లను సాధించిన బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే 291 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు అవసరం. అంటే, అత్తెసరు మెజారిటీతో ఎన్డీయే మేజిక్ మార్కును దాటినట్లే! అదే సమయంలో గత ఎన్నికల్లో కేవలం 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి సెంచరీ కొట్టింది! ఆ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి కూడా గతం కంటే భారీగా బలపడింది. ఈసారి ఎన్నికల్లో 234 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అయినప్పటికీ అధికారానికి కావాల్సిన సీట్లకు చాలా దూరంలో ఉంది. మరోవైపు బీజేపీ కూడా మిత్రపక్షాలపై ఆధారపడి ఉంది. అందులో ప్రధానంగా ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు ఏయే పదవులు లభిస్తాయనేది ఆసక్తి ఏర్పడింది.
ఈమేరకు జేపీ నడ్డా నివాసంలో సమావేశమైన బీజేపీ నేతలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. హోంశాఖ, రక్షణ, ఆర్థిక, మౌలిక, వ్యవసాయ, విదేశాంగ వంటి శాఖలను బీజేపీ ఎంపీలకే కేటాయించనున్నారు. ఎంపీ సంఖ్యలో కూటమిలో రెండో స్థానంలో ఉన్న టీడీపీకి విమానయాన శాఖ, ఉక్కు శాఖలతో పాటు.. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని నిర్ణయించినట్లు సమాచారం. జేడీయూకు గ్రమీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ఇవ్వనున్నారు. తమకు ఈ పదవులు కావాలని మిత్రపక్షాల నుంచి పెద్దగా డిమాండ్లు రాలేదని తెలుస్తోంది. కీ రోల్ లో ఉన్న చంద్రబాబు కూడా ఎటువంటి డిమాండ్లనూ బీజేపీ నాయకత్వం వద్ద పెట్టలేదని సమాచారం. బీజేపీ అగ్రనాయకత్వానికే నిర్ణయం వదిలేసినట్లు తెలిసింది. ఏది ఎంత వాస్తవం.. ఎవరికి ఏ శాఖలు దక్కుతాయి అనేది మున్ముందు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY