ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలిచిన సుప్రసిద్ధ క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ ఆలయ ఛైర్మన్ పదవి కోసం ముందు నుంచి కూడా నేతలు పోటీ పడుతుంటారు. ఎప్పుడూ టీటీడీ చైర్మన్ పదవికి గట్టి పోటీ ఉంటుంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ఆ పదవిని ఆశించారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవిని భూమన కరుణాకర్ రెడ్డికి అప్పగించారు. రెండోసారి భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడి పోయి అధికారం చేజారింది. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీకి కొత్త ఛైర్మన్‌ను నియమించే పనిలో ఉన్నారు. అయితే మొన్నటి వరకు కూడా ఆ పదవిని చంద్రబాబు నాయుడు జనసేనకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరిగింది. జనసేన కీలక నేత నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవిని ఇవ్వనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అదే సమయంలో టీటీడీ ఛైర్మన్ రేసులో మరికొంత మంది పేర్లు కూడ తెరపైకి వచ్చాయి. ప్రము సినీ నిర్మాత అశ్వనీదత్, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు, మాజీ ఎంపీ సినీ నటుడు మురళీ మోహన్‌లలో ఒకరిని టీటీడీ ఛైర్మన్ పదవి వరించనుందని వార్తలు గుప్పుమన్నాయి.
అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అంశం తెరపైకి వచ్చింది. టీటీడీ ఛైర్మన్ పదవి పూసపాటి అశోక్ జగపతి రాజు.. మరళీ మోహన్‌లలో ఒకరికి దక్కనున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ టీటీడీ ఛైర్మన్ పదవి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారట. తెర వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరుపుతున్నారట. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి అశోక్ గజపతి రాజు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎన్నోసార్లు టీడీపీ ప్రభుత్వ హయాంల రాష్ట్ర మంత్రిగాపని చేశారు. 2014 ఎంపీగా గెలిచి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో పౌర విమానయాన శాక మంత్రిగా కూడ పని చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని తన కూతురు అదితి గజపతి రాజును బరలోకి దించారు.
అటు మురళీ మోహన్ కూడా టీటీడీ చైర్మన్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన 2009లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి తెలుగు దేశం పార్టీ తరుపున పోటీ చేశారు. కానీ అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో మరోసారి మురళీ మోహన్ పోటీ చేశారు. ఈసారి ఒక లక్షా డెబ్బై వేళ ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే ఇద్దరూ టీడీపీకి కీలక నేతలే కావడంతో.. వారిలో ఎవరికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి చంద్రబాబు ఎవరికి పదవిని ఇస్తారో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE