ఆ నెంబర్‌కు కాస్త అటూ ఇటూ అయినా నో

Janasena, Pawan Kalyan,Politics,Chandrababu, Ticket, Nadendla Manohar,Janasena,2024 Elections,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Janasena, Pawan Kalyan,Politics,Chandrababu, Ticket, Nadendla Manohar,Janasena, Pawan Kalyan,

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నా..పొత్తులతో జనసేనను ఇన్నాళ్లు నమ్ముకున్న నేతల  సీట్ల విషయంలో మెత్తబడే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.తాజాగా రాజమండ్రిలో జనసేన నేతలతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు టీడీపీలో కొంత కలవరాన్ని రేపుతున్నాయి.

జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాలలో గెలుస్తామని పవన్  చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన 40 స్థానాలకు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. దీంతో 40 కంటే ఎక్కువ 40 కంటే తక్కవ స్థానాలను పవన్ కోరుకోవడం లేదని క్లారిటీ ఇచ్చినట్లు అయింది. అంతేకాకుండా.. ఒంటరిగా పోటీ చేసినా కూడా జనసేన నలభై స్థానాల్లో గెలుస్తాదని, కానీ ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తుపెట్టుకున్నామని పవన్  చెప్పడంపై  టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు సర్వేలు చేయించడంతో పాటు.. గత ఎన్నికల ఫలితాలను, 2009లో ప్రజారాజ్యం పోటీ చేసిన స్థానాలను ఇలా అన్ని రకాలుగా లెక్కలు వేసుకుని మరీ ఒక అంకెను ఫిక్స్ చేసుకున్నట్లు పార్టీ వర్గాలు ఇప్పటికే చెప్పాయి. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నా కూడా..ఆ అంకెకు  ఏమాత్రం తగ్గకుండా  టీడీపీ నుంచి సీట్లు  తీసుకోవాలన్న ఆలోచనతోనే  జనసేనాని ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన తూర్పుగోదావరి జిల్లా టూర్‌లో సీట్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

మరోవైపు సీనియర్ నేత హరిరామ జోగయ్య కూడా సుమారు ఇదే సీట్ల సంఖ్యను చెప్పడాన్ని బట్టి చూస్తుంటే..వీరిద్దరి  మధ్య గతంలోనే సీట్లపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా  శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో జనసేన కోరుకున్న నలభై స్థానాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎక్కువగా విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే పోటీ చేయాలని, రాయలసీమలోనూ కొన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తే భవిష్యత్‌లో పార్టీ విస్తరించుకోవడానికి బాగుంటుందనే అంచనాతోనే  పవన్ టీడీపీతో పొత్తుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.

అయితే  పాత పదమూడు జిల్లాల్లో కూడా జనసేన పోటీ చేసేలా కూడా పవన్ కొన్ని స్థానాలను ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు చాలాసార్లు జరిగిన చర్చలలో..ఈ అంకె గురించి చెప్పినట్లు తెలుస్తోంది. కాకపోతే మధ్యలో బీజేపీ ఎంటర్ అయితే సీట్ల  విషయంలో ఇద్దరు నేతలు కూడా కొంత సర్ధుకుపోవాల్సిన పరిస్థితి తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  అయితే బీజేపీతో పొత్తు ఉన్నా కూడా..టీడీపీ పాతిక సీట్లతో సరిపెడదామని భావించినా.. పవన్ దానికేమాత్రం అంగీకరించే అవకాశాలు  లేవన్నది పవన్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eleven =