ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలుపు తీరుతుండటంతో.. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి పైన చర్చ జరుగుతుంది. టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.
తాజాగా టీడీపీ చైర్మన్ పదవికి కరుణాకర్ రెడ్డి రాజీనామా చేయడంతో, ఈ పదవి కోసం చంద్రబాబు దృష్టిలోకి కొంతమంది పేర్లు వచ్చినట్లు..ఆ పేర్లను ఇప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.వీరిలో ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్, సినీ నటుడు.. పవన్ కళ్యాణ్ సోదరుడు కొణెదల నాగబాబు, ఓ టీవీ ఛానల్ అధినేత ఉన్నట్లు సమాచారం.
టీటీడీ చైర్మన్ పదవికి అశ్వినీ దత్‌ను చంద్రబాబు ఎంపిక చేస్తారని ఏపీలో రెండు రోజుల నుంచి చర్చ జరుగుతుంది. మొదటి నుంచీ అశ్వనీ దత్‌తో చంద్రబాబుకు ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయనకు ఈ పదవిని ఇవ్వొచ్చని చాలామంది అంటున్నారు. చంద్రబాబుకు ఏ కష్టం వచ్చినా తానున్నాననే సన్నిహితులలో ఆయన ఒకరని.. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు, జైలుకు వెళ్లి కలిసి మద్దతుగా ఉన్నారు.
అంతేకాదు ఏపీలో ఎన్నికల తర్వాత ఈసారి టీడీపీ 160 స్థానాలు దక్కించుకుంటుందని అశ్వినీదత్ చెప్పారు. ఆయన చెప్పిన మాట ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలను దక్కించుకుంది. అలాగే ఎన్నికల సమయంలో చంద్రబాబుకు మద్దతుగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు అశ్వినీ దత్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు.. ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ పదవిని కచ్చితంగా ఆయనకే ఇస్తారన్న చర్చ సాగుతోంది.
మరోవైపు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొణెదల నాగబాబు ఎన్నికల సమయంలో..కూటమి కోసం సీట్ల సర్దుబాటు చేయడం కోసం, తాను త్యాగం చేసి పోటీ నుంచి తప్పుకున్నారు.అలాగే కూటమి విజయం కోసం కూడా ఆయన కీలకంగా పని చేశారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా అవకాశం ఇచ్చే వారి పేర్లలో నాగబాబు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో వీరిద్దరితో పాటు అనూహ్యంగా ఓ టీవీ ఛానల్ అధినేతకు కూడా టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇవ్వడానికి చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. టీడీపీకి మొదటి నుంచీ మద్దతుగా నిలిచిన ఆ టీవీ ఛానల్ అధినేతకు తొలి విడతగా రెండేళ్ల పాటు టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తారన్న చర్చ ఆ పార్టీ వర్గాలలో జరుగుతోంది. అలాగే ఇంకో పేరు ఈ రేసులో వినిపిస్తోంది. తాజాగా బీజేపీ నుంచి గెలిచిన ఒక ఎంపీ పేరును కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.మరి వీరిలో ఎవరిని ఈ ప్రతిష్టాత్మకమైన పదవి వరిస్తుందో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY