ఇటీవల వైసీపీకి విజయ సాయిరెడ్డి గుడ్ బై చెప్పి..రాజ్యసభ పదవిని కూడా వదులుకున్నారు. దీంతో ఆ ఒక్క సీటుకు ఇప్పుడు ఉప ఎన్నిక జరగాల్సి ఉండటంతో.. త్వరలో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే ఆ పదవి బీజేపీకి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చాలామంది ఆశావహులు ఉన్నా సరే.. రెడ్డి సామాజిక వర్గానికి ఆ పదవి ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు సీఎం చంద్రబాబు కూడా కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన జీవీఎల్ నరసింహం ..సీట్ల సర్ధుబాటులో భాగంగా బీజేపీకి అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు. అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీఎం రమేష్ గెలిచారు. దీంతో ఇప్పుడు రాజ్యసభకు జీవిఎల్ కు అవకాశం ఇస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో చాలా మంది ఆశావహులు ఉన్నా..ముఖ్యంగా జీవీఎల్, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య గట్టి ఫైట్ నెలకొంది.
ఇంతకు ముందు మూడు రాజ్యసభ స్థానాలకు గాను రెండింటిని టీడీపీ తీసుకోగా.. జనసేన త్యాగం చేయడంతో ఆ ఒక్క పదవిని బీజేపీ పొందగలిగింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంో.. రాజ్యసభ పదవి కోసం మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇప్పుడు ఆ సీటు కూడా బీజేపీ కోరుకుంటుంది ఆ పార్టీ అగ్రనేతల విన్నపంతో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కూడా అంగీకరించినట్లు ప్రచారం సాగుతోంది. అందుకే బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, జీవీఎల్‌లో ఎవరో.. ఒకరికి రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది. అయితే బీజేపీ పెద్దలు మాత్రం జీవీఎల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబుతో పాటు ఏపీ కూటమి నేతలు కూడా కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది.