ఈ సారి ఎచ్చెర్లలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది?

Who Will Win The Election War Of Etcherla?,Election War,Etcherla,YCP,TDP,Janasena,Chandrababu,Jagan,Pawan Kalyan,Kala Venkatarao,Kalishetty Appalanaidu,Iswara Rao,Kiran Kumar,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,Etcherla Politics,Etcherla Elections,Srikakulam,Etcherla Assembly constituency,Etcherla Assembly Election 2024,Etcherla Constituency

శ్రీకాకుళం జిల్లాలో ఆర్ధిక కేంద్రంగా ఉన్న నియోజకవర్గం .. ఎచ్చెర్ల నియోజకవర్గం.  ఇక్కడ ఓ వైపు విద్యాసంస్థలు మరోవైపు సముద్రతీరం ఉండటమే కాదు.. దీనికి తోడు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండటంతో ఈసారి ఎన్నికలలో ఎచ్చెర్లలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

1967లో ఎచ్చర్ల నియోజకవర్గం ఏర్పడగా..తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 183 నుంచి 1999 వరకు తెలుగు దేశం పార్టీనే గెలుపును . అంతేకాదు ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి గెలిచిన ప్రతిభా భారతి స్పీకర్‌గానూ  పని చేశారు.

అయితే 2009లో ఎచ్చెర్ల జనరల్ నియోజకవర్గంగా  మారగా.. 2009లో కాంగ్రెస్,2014లో తెలుగు దేశం పార్టీ, 2019లో వైస్సార్సీపీ అభ్యర్ధులు గెలుస్తూ వచ్చారు.  ఈ సారి ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పొత్తులో భాగంగా బీజేపీ  అభ్యర్థి బరిలో దిగుతున్నారు. కూటమి తరపున ఈశ్వరరావు పోటీ చేస్తుండగా వైఎస్సార్సీపీ నుంచి  సిట్టింగ్ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ పోటీ పడుతున్నారు.

ఇక ఎచ్చెర్ల సీటు కోసం తెలుగు దేశం పార్టీలో కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు మధ్య తీవ్ర పోటీ జరిగింది. అయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి ఇవ్వగా ఈశ్వరరావు పోటీలో ఉండాల్సి రావడంతో.. కళా వెంకట్రావుకు చీపురుపల్లి అసెంబ్లీ టికెట్‌ను..కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం ఎంపీ సీటును ఇచ్చిన చంద్రబాబు వీరిద్దరి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టారు.

ఈ ఐదేళ్లలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమాతో కిరణ్ కుమార్ ఉన్నారు . మరి ఎచ్చెర్ల ఓటర్లు ఈసారి ఎలాంటి భిన్నమైన తీర్పును ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + fourteen =