కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగిన కీలక నేతలు

ap, congress, ys sharmila, congress high command, dk siva kumar
ap, congress, ys sharmila, congress high command, dk siva kumar

పోయిన చోటే వెతుక్కోవాలి.. రాజకీయాల్లో ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ అదే చేస్తోంది. ఎక్కడైతే తమ పార్టీ పాతాలానికి వెళ్లిపోయిందో.. అక్కడే పూర్తవైభవం దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. తమ పార్టీని పటిష్టం చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీని పున:నిర్మించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాలు ఫలించాయి. అసలు కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకునే టైమ్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఒక్కో అడుగు ముందుకేస్తూ పార్టీ పటిష్టం అయింది. పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది.

తెలంగాణ ఇచ్చిందే తామని.. తెలంగాణలో అధికారం తమదేనని 2014లో కాంగ్రెస్ భావించింది. కానీ గులాబీ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్ వ్యూహాలరు ప్రతి వ్యూహాలు పన్నుతూ.. ఆ పార్టీని పాతాళానికి తొక్కారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ లేనే లేదు అనే స్థితికి తీసుకొచ్చారు. రెండేళ్ల పాటు అధికారంలో కొనసాగారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఎదగడం కష్టమే.. ఇక ఇక్కడ కాంగ్రెస్ పని అయిపోయింది అనుకునే సమయంలో.. ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పుంజుకుంది. తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈక్రమంలో ఇప్పుడు ఏపీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా తమ పార్టీని పున:నిర్మించుకోవాలని.. తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది.

వాస్తవానికి చెప్పాలంటే.. జగన్ వైసీపీని స్థాపించినాకే కాంగ్రెస్‌కు ఏపీలో పెద్ద దెబ్బ పడింది. కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలంతా వైసీపీ వైపు టర్న్ అయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌కు అక్కడ కష్టాలు మొదలయ్యాయి. రాను రాను ఏపీలో కనుచూపు దూరంలో కూడా కాంగ్రెస్ కనిపించకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ కేడర్ కూడా వైసీపీ వైప్ వెళ్లిపోయింది. కానీ ఏపీపై పట్టు సాధించాలనే కాంగ్రెస్ హైకమాండ్ ఆశలు మాత్రం చావలేదు. వైసీపీని పాతాళంలోకి నెట్టితే తిరిగి ఏపీలో పుంజుకోవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. అందుకే జగన్ సొంత చెల్లెలు అయిన వైఎస్ షర్మిలను రంగంలోకి దించింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలను ఆమె చేతికి అందించింది. ఏపీలో పార్టీని పటిష్టం చేయడానికి ఏం కావాలో అన్నీ ఇచ్చింది.

వైఎష్ షర్మిల కూడా ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గతంలో పార్టీని వదిలి వెళ్లిన వారిని తిరిగి సొంత గూటికి తీసుకొచ్చేందుకు కష్ట పడ్డారు. ఇక ఎన్నికల వేళ తన సొంత అన్నపై షర్మిల పెద్ద యుద్ధమే చేశారు. కాంగ్రెస్ గెలుపు కంటే వైసీపీ పతనమే లక్ష్యంగా షర్మిల పావులు కదిపారు. వైసీపీని మట్టికరిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. వైసీపీకి ఎంత డ్యామేజీ చేయాలో అంతా చేశారు. చివరికి వైసీపీ ఓటమి పాలయింది. అత్యంత దారుణంగా ఓడిపోయింది. దీంతో కాంగ్రెస్‌కు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి.

ఈక్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ రెండో ప్లాన్‌ను అమలు చేసేందుకు సిద్ధమయింది. ఇందుకోసం ఇద్దరు సీఎంలు.. డిప్యూటీ సీఎంను రంగంలోకి దించింది. జూలై 8న వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని విజయవాడలో వైఎస్ షర్మిల పెద్ద ఎత్తున సభను నిర్వహిస్తున్నారు. ఈ సభ ద్వారా వైఎస్సార్ తమ వాడేననిచాటడమే కాకుండా.. ఆయన పాలనను సంక్షేమ రాజ్యాన్ని తెచ్చే సత్తా తమకే ఉందని చెప్పుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. అలాగే ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఆహ్వానించారు. వారు ఈ సభలో పాల్గొననున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిలను కొనసాగిస్తూనే.. అక్కడ పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను సిద్ధరామయ్య, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డిలకు పార్టీ హైకమాండ్ అప్పగించిందట. వారు పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇలా కీలక నేతలంతా కలిసి ముందు ముందు ఏపీలో కాంగ్రెస్‌ను పరుగులు పెట్టించనున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE