వామ్మో.. పెమ్మ‌సానిని ఎదుర్కోవ‌డం ఎలా?

Pemmasani Chandrasekhar, TDP, Guntur MP Candidate, Lok Sabha elections,Ambati Rayudu,Guntur,tdp-janasena,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,andhra pradesh,Mango News Telugu, Mango News
Pemmasani chandrasekhar, TDP, Guntur MP Candidate, lok sabha elections

“కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడనుకున్నావా? వారణాసిలో బ్రతుకుతున్నాడు తన వరస మార్చు కున్నాడనుకున్నావా? అదే రక్తం, అదే పౌరుషం..!!.. ” ఇంద్ర సినిమాలో హీరో చిరంజీవి చెప్పిన ఈ డైలాగులు మాదిరిగానే.. గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలోని రాజ‌కీయాల్లోనూ ఓ వ్య‌క్తి పంచ్ డైలాగ్‌లో ప్ర‌తిప‌క్షాల‌కు చుక్క‌లు చూపుతున్నారు. మ‌నిషి చూస్తే సాఫ్ట్.. మాట చూస్తే ఫైట్‌.. మంచిత‌నంలో శిఖ‌రం.. చెడును ఎదిరించ‌డంలో బెద‌ర‌ని నైజం.. ఆ వ్య‌క్తి సొంతం. ఊహ‌ల‌కు అంద‌ని విధంగా ఆయ‌న చేస్తున్న రాజకీయాల‌కు  “వామ్మో.. పెమ్మ‌సానిని ఎదుర్కోవ‌డం ఎలా? ” అంటూ ప్ర‌త్య‌ర్థుల ముఖాలు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతున్నాయి. ఎస్‌.. ఆయ‌నే డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌.

అమెరికాకు వెళ్లిపోయాడు.. వైద్య‌వృత్తిలో ఉన్నాడు.. మంచోడు.. రాజ‌కీయాల‌కు ప‌నికిరాడు.. అనుకున్నారు చాలా మంది. తెలుగుదేశం-జ‌న‌సేన కూట‌మి గుంటూరు లోక్‌స‌భ ఎంపీ అభ్య‌ర్థిగా పెమ్మ‌సాని పేరు ప్ర‌క‌టించ‌డంతో త‌మ గెలుపు ఖాయం అని ధీమాగా ఉన్నప్ర‌త్య‌ర్థి పార్టీ వైసీపీ.. ఆయ‌న రాజ‌కీయాల‌ను చూసి, ప్ర‌సంగాల‌ను విని ఆశ్చ‌ర్య‌పోతోంది. లెక్క‌ల‌తో.. ఆధారాల‌తో.. అధికార పార్టీ చేసిన త‌ప్పుల‌ను ఎత్తిచూపుతూ.., ఉదాహ‌ర‌ణ‌ల‌తో.. పేర్ల‌తో.. తెలుగుదేశం పార్టీ చేసిన గొప్ప‌ల‌ను చెబుతూ.. డాక్ట‌ర్ పెమ్మ‌సాని చేస్తున్న ప్ర‌చారంతో వైసీపీ నేత‌లు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డారు. మ‌రోవైపు  వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల విష‌యంలో తీసుకుంటున్న పార్టీ కేడ‌ర్‌లో క‌న్‌ఫ్యూజన్ లో ప‌డేస్తుంటే.. మ‌రోవైపు ప్ర‌త్య‌ర్థి పార్టీ ఎంపీ అభ్య‌ర్థి అయిన చంద్ర‌శేఖ‌ర్ దూసుకెళ్తున్నారు. దాంతో టీడీపీ కేడ‌ర్‌లో ఉత్సాహం పెరుగుతోంది.

రోజురోజుకూ స‌మావేశాల ద్వారా, ఆత్మీయ‌స‌భ‌ల ద్వారా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. ప్ర‌జాద‌ర‌ణ పెంచుకుంటున్నారు. అప్ప‌టికే ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాల ద్వారా పెమ్మ‌సాని పేరు ప్ర‌జ‌ల్లో ఎప్ప‌టినుంచో ప‌లుకుతోంది. ఇప్పుడు నేరుగా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ త‌మ‌ను క‌లుస్తుండ‌డంతో గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలోని మెజారిటీ ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. పెమ్మ‌సాని రాక‌తో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆద‌ర‌ణ గ‌మ‌నిస్తున్న వైసీపీ శిబిరంలో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఇప్ప‌టికే నియోజక‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల మార్పుల‌తో వైసీపీ శ్రేణులు గంద‌ర‌గోళంలో ప‌డ్డాయి.

ఓ టైంలో టీం ఇండియా క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు, ఆ త‌ర్వ‌త వైసీపీ సీనియ‌ర్ నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు ,  ఆయ‌న కూడా కాద‌ని 20 రోజులకే పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారు రోశ‌య్య‌ను తెర‌పైకి తెచ్చారు. వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల‌కు ముందు రోశ‌య్య గుంటూరు వైసీపీ పార్ల‌మెంటు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అయితే నోటిఫికేష‌న్ వ‌చ్చాక చివ‌ర్లో రోశ‌య్య‌ను పొన్నూరు పంపి… గుంటూరు పార్ల‌మెంటు నుంచి మోదుగులను పోటీ చేయించింది. అప్పుడు రోశ‌య్య పొన్నూరులో స్వ‌ల్ప తేడాతో విజ‌యం సాధిస్తే.. గుంటూరు ఎంపీగా పోటీచేసిన మోదుగుల గ‌ల్లా జ‌య‌దేవ్ చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా వైసీపీ నుంచి అభ్య‌ర్థి ఎవ‌రైనా టీడీపీ అభ్య‌ర్థిగా పోటీచేస్తున్న డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ చేతిలో ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. వామ్మో.. పెమ్మ‌సానిని ఎదుర్కోవ‌డం ఎలా? అనే చ‌ర్చ ఇప్ప‌టికే ప్ర‌త్య‌ర్థివ‌ర్గంలో మొద‌లుకావ‌డమే అందుకు నిద‌ర్శ‌నం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE