ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. అధికార వైసీపీని కాదని కూటమి వైపే ఏపీ ఓటర్లు మొగ్గు చూపడంతో ఘోరంగా పరాజయం పాలైంది. కౌంటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచే కూటమి దూకుడుతో గెలుపుపై అంచనాలు వచ్చేశాయి. అయితే ఒకవేళ కూటమి విజయం సాధించినా కూడా వైసీపీ గట్టి పోటీ ఇస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ కనీస స్థాయిలో కూడా వైసీపీ నేతలు పోటీ ఇవ్వలేకపోయారు. ఎన్నికల ముందు వై నాట్ 175 అంటూ డాంభికాలు పోయిన వైసీపీ నేతలు… ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో సైలెంట్ అయిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తీర్పు ఎప్పటికప్పుడు మారుతూ వస్తుందన్న విషయం తెలిసిందే. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఆంధ్ర ప్రజలు పట్టం కట్టి.. అధికారానికి కావాల్సిన సీట్లను కట్టబెట్టారు. తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీనిక కాదని వైసీపీకి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను అందించారు. వైసీపీకి అద్భుతమైన మెజారిటీని అప్పగించి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు.
ఓటరుతో పెట్టుకుంటే ఎలాంటి వారినైనా ఓడించే సత్తా తమకు ఉందని ఓటర్లు మరోసారి నిరూపించారు. వై నాట్ 175 అంటూ కుప్పంలో కూడా మనం గెలుస్తున్నామంటూ ఎన్నికల ప్రచారం పూర్తి అయ్యే వరకు జగన్ చెబుతూ వచ్చారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్‌ను ఓడిస్తామంటూ జగన్‌తో పాటు మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే చెప్పారు. కానీ మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు.
అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా.. కనీసం ప్రతిపక్ష హోదాలో అయినా వైసీపీ అసెంబ్లీలో ఉంటుందని అంతా అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి. కౌంటింగ్ ప్రారంభంలో వైసీపీకి మెరుగైన ఫలితాలు వస్తాయని చాలామంది అంచనా వేసినా… చివర్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత పెంచుకున్నారో అర్ధం అవుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో ఒక్క చోట తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో ఓడిపోయిన జనసేన..ఇప్పుడు వైసీపీ కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో ..దటీజ్ పవన్ కళ్యాణ్ అంటూ జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY