ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీ ఫిరాయించేందుకు సిద్దమయినట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, కీలక నేతలు అధికారపక్షంలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు మీడియా ముందుకు వచ్చి ఆ వార్తలను ఖండించారు. అయినప్పటికీ ఈ ప్రచారానికి చెక్ పడడం లేదు. తాజాగా వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కాషాయపు కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అవును.. బీఆర్ అంబేడ్కర్ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బీజేపీ వైపు చూస్తున్నారట. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోవడం.. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొనడంతో త్రిమూర్తులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారట. ఆయనతో పాటు బీఆర్ఎస్ అంబేడ్కర్ జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా కాషాయపు కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారట. వారితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారట.
బీజేపీకి పెద్ద ఎత్తున చేరిక ప్రతిపాదనలు వస్తుండడంతో.. వాటిని బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి నారా లోకేష్ ముందు పెట్టారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు సహా పలువురు వైసీపీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వారు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి చేరికలపై కూటమితో చర్చించి నిర్ణయాలు తీసుకుందామని లోకేష్ బీజేపీ నేతలతో అన్నారట. కూటమి పార్టీలకు అభ్యంతరం లేని వారి మాత్రమే తీసుకుందామని వారితో చెప్పారట. కొత్తవారిని చేర్చుకునే ముందు కూటమి ఐక్యత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని వారితో నారా లోకేష్ అన్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF