కొద్దిరోజులుగా ఏపీలో ఒక వార్త వైరలవుతోంది. వైసీపీ ఎంపీలు అంతా బీజేపీ వైపు చూస్తున్నారని.. త్వరలోనే వారు కాషాయపు కండువా కప్పు కుంటారని ఆ వార్త సారాంశం. మరికొందరు ఎంపీలు ఇప్పటికే బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని.. రేపో, మాపో వాళ్లు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని గుసగుసలు వినిపించాయి. ఈ వార్తలపై కొద్దిరోజుల క్రితం వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డిలు స్పందించారు. ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. బీజేపీలో చేరే ఖర్మం తమకు పట్టలేదని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీని వీడి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరుతారనే ప్రచారం మాత్రం ఏమాత్రం ఆగడం లేదు.
ఈ సమయంలో మరో వార్త తెరపైకి వచ్చింది. త్వరలోనే వైసీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారట. ప్రస్తుతం వైసీపీకి లోక్ సభలో నలుగురు ఎంపీలు.. రాజ్యసభలో పదకొండు మంది ఎంపీల బలం ఉంది. ఇప్పుడు ఆ పదిహేను మంది ఒక్కసారిగా వెళ్లి మోడీని కలవనున్నారట. ఇప్పటికే ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి వైసీపీ ఎంపీలు, బీజేపీలో చేరబోతున్నారంటూ వైరలవుతున్న వార్తలకు బలం చేకూరింది. బీజేపీలో చేరడం గురించే వారు చర్చలు జరిపేందుకు వైసీపీ ఎంపీలు మోడీని కలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి వైసీపీలోని పలువురి నేతలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పెద్దిరెడ్డి కుటుంబం ల్యాండ్, స్యాండ్, లిక్కర్ స్కామ్‌లలో కూరుకుపోయింది. మరికొంత మంది వైసీపీ ఎంపీలు కూడా చిక్కులు ఎదుర్కోక తప్పుదు అని అటున్నారు. దీంతో కొందరు ఎంపీలు బీజేపీలోకి వెళ్లడం ద్వారా.. సేఫ్ సైడ్‌లో ఉండొచ్చని భావిస్తున్నారట. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ కూడా ఇదే ఫార్ములాను అప్లై చేసింది. టీడీపీలోని పలువురు నేతలు వైసీపీలోకి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ టార్గెట్ నుంచి తప్పించుకున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ కూడా అదే ఫార్ములాను అప్లై చేయాలని చూస్తోందట. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE