
అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 8 రెండు రోజుల్లో స్టార్ట్ కానుంది. ఓవైపు ఈ షో పై వివాదాలు ఎన్ని వస్తున్నా.. ఎప్పటికప్పుడు అభిమానులు ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు బిగ్‌బాస్ రియాల్టీ షో స్టార్ట్ కానుందని ఇదివరకే నిర్వాహకులు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బుల్లితెరపై అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇక షూరు కానుందంటూ కొన్నిరోజులుగా వరుస ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు నాగార్జున.
సీరియల్ యాక్టర్స్, హీరోహీరోయిన్స్, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్, మోడల్స్ ఇలా చాలా మంది ఈసారి హౌస్ లోకి ఎంటరయ్యేందుకు రెడీ అయ్యారనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే పలువురి పేర్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. బర్రెలక్క, కుమారీ ఆంటీ, అమృతా ప్రణయ్, రాజ్ తరుణ్ బిగ్‌బాస్ షో ఆఫర్ గురించి రియాక్ట్ అయ్యారు. తాజాగా హౌస్ లోకి అడుగుపెట్టేందుకు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని.. వారంతా హౌస్ లోకి ఎంట్రీ కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఓ పది మంది ఫైనల్ అంటూ ఓ లిస్ట్ బయటికి వచ్చింది. అంతేనా బిగ్ బాస్ మాజీలు కూడా ఈ సీజన్‌లో పాల్గొంటారని మరో న్యూస్ వైరల్ అయ్యింది.
ఈ సీజన్‌లో మొత్తం 19 మంది పాల్గొంటారని.. ముందుగా 14 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఇది వరకు నెట్టింట వినిపించిన పేర్లు కాకుండా ఇప్పుడు మరికొంత మంది కొత్త సెలబ్రెటీల పేర్లు తెరపైకి వచ్చాయి.
బిగ్ బాస్ పైనల్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న 14 మంది వీళ్లే :
విష్ణుప్రియ భీమినేని
శేఖర్ బాషా
నైనికా
విస్మయ శ్రీ
గాయకుడు సాకేత్
ఆదిత్య ఓం
మోడల్ రవితేజ
దర్శకుడు పరమేశ్వర్
ఖయ్యూమ్ అలీ
సౌమ్యరావు
అంజలి పవన్
అభినవ్ నవీన్
బెజవాడ బేబక్క
అభిరామ్ వర్మ
వైల్డ్ కార్డ్ ద్వారా మరో ముగ్గురు: ఈ 14 మంది దాదాపు నూటికి నూరు శాతం బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్స్ అని పక్కా అంటూ ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ రీతూ చౌదరి, సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ వర్మ, రాకింగ్ రాకేష్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. అయితే, వీరిని షో ప్రారంభం అయిన రెండో వారం, లేదా మూడో వారం హౌజ్‌లోకి పంపించనున్నారట. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్స్ హరితేజ, ఆదర్శ్‌ను, BB 3 హౌజ్‌మేట్స్ పునర్నవి, వరుణ్ సందేశ్ భార్య వితిక, అలాగే బిగ్ బాస్ తెలుగు 5 సీజన్‌లో పాల్గొన్న సిరి హన్మంతు పేర్లు లిస్ట్‌లో ఉన్నాయని సమాచారం. వీళ్లందరిలో ఇద్దరు పాల్గొంటారని టాక్ వినిపిస్తుంది. అయితే ఇవన్నీ నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.
సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు స్టార్ మాలో ఈ షో ప్రారంభం కానుంది. ఈషోకు సంబంధించిన అన్ని ఎపిసోడ్‌లు Disney+ Hotstarలో ప్రసారం కానున్నాయి. అక్కినేని నాగార్జున వరుసగా ఐదోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.