అంతా అనుకున్నట్లుగానే, సోషల్ మీడియాలో జరిగిన చర్చ ప్రకారమే.. బిగ్ బాస్ సీజన్ 8లో ఈవారం బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి ఎలిమినేషన్ లేకుండానే ముగిసింది. ఈవారం కంటెస్టెంట్స్ అంతా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు.
నిజానికి ఈ వీక్ నామినేషన్స్‌లో టేస్టీ తేజ, గౌతమ్, యష్మి, పృథ్వీ, అవినాష్, విష్ణు ప్రియ ఉన్నారు. అయితే ఆడియన్స్ నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో.. టేస్టీ తేజ, అవినాష్‌లు చివరి వరకూ నామినేషన్స్‌లో కొనసాగారు.
అయితే ఈ వారం ముక్కు అవినాష్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. నబీల్ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్‌తో అవినాష్‌ని సేవ్ చేశాడు. టేస్టీ తేజ, అవినాష్‌లో ఎవరి కోసమైనా నువ్వు గెలుచుకున్న ఎవిక్షన్ షీల్డ్ ఇస్తావా.. లేదా తర్వాత నువ్వే ఉపయోగించుకుంటావా అని నబీల్‌ను హోస్ట్ నాగార్జున అడగ్గా.. షీల్డ్ గెలుచుకోవడంతో అవినాష్ కూడా ముఖ్యపాత్ర పోషించాడని.. అందుకే అతని కోసం వాడతానని నబీల్ చెప్పాడు. తన నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని నాగ్ సమయం ఇచ్చినా కూడా నబీల్ మాత్రం వెనక్కి తగ్గలేదు.
దీంతో తక్కువ ఓట్లు వచ్చినా కూడా నబీల్ వల్ల అవినాష్ సేవ్ అయ్యాడు. అయితే అవినాష్ సేవ్ అవడంతో..టేస్టీ తేజను ఎలిమినేట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ టేస్టీ తేజను కూడా ఎలిమినేట్ చేయడం లేదని నాగార్జున ప్రకటించడంతో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తంగా నబీల్, నాగ్ తీసుకున్న నిర్ణయాలతో అవినాష్, టేస్టీ తేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
ఇదిలా ఉంటే వచ్చే వారానికి సంబంధించి బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే 8వ సీజన్‌ను ఈసారి కొత్తగా ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను విభిన్నంగా నిర్వహించనున్నారు. సీజన్-8 నుంచి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్స్ అందరినీ తీసుకొచ్చి, వాళ్లతో తగిన కారణాలు చెప్పించి ..బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఇద్దరిని నామినేట్ చేయనున్నారు. వారిలో ఎవరికి ఓట్లు తక్కువగా వస్తే వారే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతారు. అయితే ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో.. ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారో అనేది తెలుసుకోవాలంటే వచ్చే వారం వరకూ ఆగాల్సిందే.