బిగ్ బాస్ తెలుగులో నాలుగో వారం రచ్చ రచ్చగా జరిగిన నామినేషన్లలో. ఈసారి నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. అయితే ఈ నామినేషన్లో ఉన్నవారిలో నాగమణికంఠ, పృధ్విరాజ్, ఆదిత్య ఓం, నబీల్, సోనియా, ప్రేరణ ఉన్నారు. వీరిలో ఎక్కువగా ఓటింగ్ తో నబీల్ దూసుకువెళ్లిపోతున్నాడు. దాదాపు 35% ఓటింగ్‌తో టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత ఓటింగ్ శాతంలో నాగమణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, పృధ్వీరాజ్, సోనియా ఉన్నారు. వీరిలో పృధ్వీరాజ్, సోనియా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఓటింగ్ ఇలాగే కొనసాగితే మాత్రం వీకెండ్ నాటికి వీళ్లిద్దరే డేంజర్ లో ఉండాల్సి వస్తుంది. దీని ప్రకారం బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం ఎలిమినేషన్ పృథ్వీ, సోనియా మధ్య ఉంటుంది. అలా జరగాలంటే విష్ణుప్రియ, నిఖిల్ ఫ్యాన్స్ చేతిలోనే ఇది ఉంటుంది. నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సోనియా, పృథ్వి కి అతను ఫ్యాన్స్ ఓట్లు వేస్తే మాత్రం వీరిద్దరూ చివరి స్థానంలో ఉండరు.
విష్ణు ప్రియ ఫ్యాన్స్ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారిపోయింది. ఇప్పుడు విష్ణు ప్రియ, నిఖిల్ ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువగా సపోర్ట్ చేస్తారో వాళ్లే టాప్ లో నిలిచే అవకాశం ఉంటుంది. వాళ్ల సపోర్ట్ మాత్రం సోనియాకి లేకపోతే ఆమె ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉంటుంది. అయితే ఈమె హౌస్ లో చాలా తప్పులు చేస్తున్నా అవేమీ టెలికాస్ట్ చేయకుండా ఉంచుతున్నారన్న టాక్ నడుస్తోంది. ఇదే కనుక బిగ్ బాస్ కంటెన్యూ చేస్తే.. సోనియాను సేవ్ చేయడానికి ఆదిత్య ఓం ని బయటకు పంపే అవకాశం కనబడుతోందన్న న్యూస్ వినిపిస్తోంది.