టాలీవుడ్ ఇండస్ట్రీ లో జానీ మాస్టర్ ఫై లైంగిక కేసు నమోదు కావడం పై పెద్ద దుమారం రేపుతుంది. రీసెంట్ గా మహిళా కొరియోగ్రాఫర్ తనపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారం చేయడంతో పాటు లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఇప్పటికే ఆయపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించారు. చిత్రసీమలో ఇలాంటి జానీ మాస్టర్ లు ఎంతో మంది ఉన్నారు కానీ ధైర్యం చేసి బాధితులు ముందుకు రావడం లేదని..ఆలా వస్తే ఎంతో మంది మాస్టర్ల బండారం బయటపడుతుందని అంత మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ కేసుపై నటి అనసూయ భరద్వాజ్ రియాక్ట్ అయ్యింది. బాధితురాలికి జరిగిన అన్యాయం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు న్యాయం జరగాలని డిమాండ్ చేసింది.
ఇంతకాలం ఆ అమ్మాయి అనుభవించిన బాధ నిజంగా దారుణమని పేర్కొన్న అనసూయ.. అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలన్నారు. మహిళలకు సానుభూతి అవసరం లేదు.. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం రావాలి. మీరే కాదు, మీకు తెలిసిన వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాటిని ప్రతిఘటించాలన్నారు. మీకు అందరూ తోడుగా నిలబడుతారనే విషయం మర్చిపోకూడదు. నేను బాధిత యువతతో కలిసి కొద్ది రోజులు పని చేశాను. ‘పుష్ప’ సెట్స్ లో రెండు, మూడుసార్లు చూశాను. కానీ, ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి. ఇలాంటి పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్ ను ఏమాత్రం తగ్గించలేవు. కానీ, మనసులో దాచుకుని బాధ పడటం వల్ల ఎలాంటి లాభం ఉండదు. నా వర్క్ ప్లేస్ లో తోటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా స్పందిస్తాను. వారికి మద్దతుగా నిలబడుతాను. బాధితురాలికి న్యాయం జరగాలని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో పాటు వోడబ్ల్యు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్మందు ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఏ మహిళకు ఎదురుకాకూడదని భావిస్తున్నాను” అని అభిప్రాయపడింది.
అంతకు ముందు జానీని ‘మాస్టర్’ అని పిలవద్దంటూ పూనమ్ సూచించింది. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు. ‘మాస్టర్’ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు. అలాగే సింగర్ చిన్మయి శ్రీపాద .. పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు.
ఢీ షో ద్వారా అతడితో పరిచయం ఏర్పడిందన్న యువతి, ఆ తర్వాత జానీ మాస్టర్ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరినట్లు చెప్పింది. షోల పేరుతో ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపింది. షూటింగ్ సెట్స్ లో క్యారవాన్ లో లైంగిక వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో వివరించింది. మతం మారి తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ చిత్రహింసలు పెట్టారని చెప్పింది. ఈ విషయం జానీ మాస్టర్ భార్యకు కూడా తెలుసని చెప్పింది. ఆమె కూడా తన మీద దాడి చేసినట్లు వెల్లడించింది. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ప్రస్తుతం కేసు విచారణ జరుపుతున్నారు.