ఎపిసోడ్ 10 (జూలై30) హైలైట్స్: వరుణ్ సందేశ్-వితికా మధ్య గొడవ

Akkineni Nagarjuna, Bigg Boss, Bigg Boss Episode 10, Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Episode 10 Highlights, Bigg Boss Telugu, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Highlights Of Bigg Boss Telugu 3, Highlights Of Bigg Boss Telugu 3 Episode 10, Mango News Telugu, Tammanah Simhadri, Varun Sandesh,Vithika,Varun Sandesh And Vithika Fight

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. మొదటగా హేమ ఎలిమినేట్ అయ్యింది, తరువాత తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో మళ్ళీ ఇంటిలో 15 మంది సభ్యులు ఉన్నారు. జులై 30న ప్రసారమైన బిగ్ బాస్ 3 పదో ఎపిసోడ్ లో గ్యాస్,కరెంట్ వృధా చేస్తుండడంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు శిక్ష విధించారు మరియు వరుణ్ సందేశ్, వితికా మధ్య వాదన జరిగింది.

ఎపిసోడ్ 10 (జూలై30) హైలైట్స్: వరుణ్ సందేశ్-వితికా మధ్య గొడవ

 • ఇంటిలోకి అడుగుపెట్టిన తమన్నా సింహాద్రి కొత్త తరహాలో తన ఆట మొదలు పెట్టింది, అందరూ నిద్రపోయాక రవికృష్ణ మైక్ దాచేసి ఉదయం అతనితో ఏమి జరిగిందంటూ ఆడుకుంది
 • వితికా మిగతా ఇంటి సభ్యులతో జరుగుతున్నా వ్యవహారాలపై డిస్కషన్స్ పెట్టింది
 • పునర్నవి భూపాలం సరదాగా తమన్నా సింహాద్రిని ఇమిటేట్ చేసింది
 • బిగ్ బాస్ హౌస్ లో గ్యాస్,కరెంట్ వృధా అవుతుండడంతో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ శిక్ష విధించారు, మూడు సైకిల్స్ ఇచ్చి వాటిని తొక్కడం ద్వారా గ్యాస్,కరెంట్, హౌజ్ ని వాడుకోవచ్చని లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు.
 • మొదట శ్రీముఖి సైకిల్ ఎక్కడంతో, టీములుగా ఏర్పడాలని అందరికి ఛాన్స్ వస్తుందని, సావిత్రి  తమన్నా సింహాద్రి, శ్రీముఖితో గొడవపడింది, వాదనలో బాధపడి ఏడ్చుకుంటూ వెళ్ళింది
 • తమన్నా సింహాద్రి కూడ నేను ముందు సైకిల్ తొక్కుతా, నైట్ నిద్ర పోవాలని గొడవ చేసింది
 • అందరూ టాస్క్ చేస్తుంటే నువ్వు వంటగదిలో ఉండడం కరెక్ట్ కాదు, ఆటలో ఇన్వాల్వ్ అవ్వు అని పునర్నవి వితికాకి సూచించడంతో గొడవ మొదలయింది
 • నేను కూడ దోశలు వేస్తున్నా, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని వితికా మాట్లాడింది
 • వరుణ్ సందేశ్ కూడ పునర్నవిని సపోర్ట్ చేయడంతో, వితికా హార్ట్ అయ్యి గట్టిగా ఏడుస్తూ బయటకు వెళ్ళింది
 • మిగిలిన సభ్యులు ఓదార్చడం, చివరికి వరుణ్ సందేశ్ క్షమాపణ చెప్పడంతో వారి మధ్య గొడవ సుఖాంతం అయ్యింది
 • శ్రీముఖి గురించి తాను ఎదో అనుకున్నానని, అంత గొప్ప పోటీదారు కాదని తమన్నా సింహాద్రి అనగా, జాఫర్ కూడ ఏకీభవించాడు. బయట క్రేజ్ చూసి ఎదో అనుకున్నానని ఇక్కడ అందరిలాగే తను కూడ ఒకరు అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసాడు
 • తరువాత ఎపిసోడ్ లో వరుణ్ సందేశ్ – సావిత్రి మధ్య ఎదో గొడవ జరిగినట్టుంది, పూర్తీ వివరాల కోసం ఈ రోజు ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here