అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప-2’ ది రూల్. ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్న వారందరికీ ఓ గుడ్ న్యూస్. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ‘పుష్ప 2’ చిత్రం ప్రకటించిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే విడుదల కానుందని తెలుస్తోంది. డిసెంబర్ 5 రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి గురువారం నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
చిత్రాన్ని ఒకరోజు ముందుగా అంటే డిసెంబరు 5న ఇండియాలో,డిసెంబరు 4న ఓవర్సీస్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. డిసెంబరు 5 అర్థరాత్రి నుంచి ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఈ చిత్రం ప్రీమియర్స్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక రేపు అనగా అక్టోబర్ 24న హైదరాబాద్‌లో జరిగే పుష్ప-2 ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు ఈ విషయంపై క్లారిటి ఇస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మీడియా సమావేశానికి మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్‌తో పాటు, హిందీ వెర్షన్‌ను విడుదల చేస్తున్న అనిల్ తడానీ, తమిళ్ వెర్షన్ రిలీజ్ చేస్తోన్న ఎజిఎస్ సంస్థ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్స్ హాజరుకానున్నారనేది తాజా సమాచారం.
నవంబరు 10 నుంచి ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా ఎగ్రెసివ్‌గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ఇక పుష్ప-2 చిత్రం 1000 కోట్లకు పైగా ప్రిరిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించింది. రష్యాతోపాటు… 20కి పైగా దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా దుమ్ము దులిపింది. బన్ని కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది..ఈ క్రమంలో పుష్ప2 పై ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో తెలిసిందే.