ఈ మధ్య కాలంలో చిన్న హీరో, పెద్ద హీరో అన్న తేడా కానీ, లో బడ్జెట్ మూవీ, హై బడ్జెట్ మూవీ అన్న తేడా కానీ ఏమీ ఉండటం చాలు లేదు. కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాల రేంజ్‌లో బ్లాక్ బస్టర్‌లు కొడుతున్నాయి.
సరిగ్గా ఇప్పుడు కమిటీ కుర్రోళ్లు సినిమా అదే రేంజ్‌లో సూపర్ హిట్ టాక్ తో దూకుడు చూపించింది. కొణిదెల నిహారిక సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీకి యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.
డిఫరెంట్ కంటెంట్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు అటు యూత్‌ను కూడా ఆకట్టుకున్న కమిటీ కుర్రోళ్లంతా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నారు. మంచి పల్లెటూరి వాతావరణంలో స్వచ్ఛమైన స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో చక్కగా తెరకెక్కించారంటూ విమర్శకులు సైతం ప్రశంసించారు.
ప్రశంసలే కాదు.. సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా రావడంతో మూవీ టీమ్ సెలబ్రెషన్స్ చేసుకుంటుంది. అయితే వీరి జోష్ పెంచేలా తాజాగా ఈ సినిమాకు మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా-2024 అవార్డు లభించింది. వరల్డ్ వైడ్ ఈ మూవీ ఫస్ట్ డేన రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఒక్క రోజే అనుకుంటే వరుసగా 4 రోజులు అది కూడా ప్రతీ రోజు 1 కోటి రూపాయలకి పైగా కలెక్షన్లు రాబడుతూ వచ్చింది.
ఇక ఫైనల్ రన్‌లో అయితే ఈ మూవీ అక్షరాల రూ.18 కోట్ల వరకు గ్రాస్‌ను, రూ.10 కోట్ల వరకు షేర్‌ను సాధించి సంచలన విక్టరీని తన ఖాతాలో వేసుకుంది.
సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారు.
ఇప్పటికే ఊహించని విజయాన్ని అందుకున్న మూవీ టీమ్.. ఈ సినిమాకు తాజాగా మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా-2024 అవార్డు కూడా రావడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. మొత్తంగా తెలుగు సినిమాను చూసే విధానాన్ని మార్చుకున్న ఆడియన్స్ కంటెంట్ కే ఓటేయడం చెప్పుకోదగ్గ మార్పు అని విశ్లేషకులు కూడా అంటున్నారు.