ఫేమస్ సీనియర్ సింగర్ అల్కా యాగ్నిక్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పిన అల్కా.. ఇయర్ ఫోన్స్ వల్ల తన చెవులకు వైరల్ అటాక్ అయినట్లు చెప్పడం షాకింగ్ విషయంగా మారింది. తనకు తన అభిమానుల ప్రార్థనలు కావాలని కోరుతూ ఇన్‌స్టాలో అల్కా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
కొంతకాలంగా తాను కనిపించడం లేదని అంతా మెసేజ్‌లు చేస్తున్నారని.. వారందరి కోసం ఈ పోస్ట్ పెడుతున్నానని అల్కా యాగ్నిక్ చెప్పారు. కొన్ని వారాల క్రితం తాను ఫ్లైట్ దిగి వస్తుండగా సడెన్‌గా తనకేమీ వినిపించలేదని.. దీంతో డాక్టర్‌ను సంప్రదిస్తే న్యూరల్ హియరింగ్ లాస్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు చెప్పారని..వైరల్ అటాక్ వల్లే ఇలా జరిగిందని అల్కా తన బాధను వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ అన్న ఆమె..తనకు తెలియకుండానే దీని బారినపడ్డానని ఎమోషనల్ అయ్యారు.
దయచేసి తనకోసం అంతా ప్రార్థించాలన్న అల్కా.. తన అభిమానులకు, సహచరులకు ఒక్కటే చెబుతున్నానని.. పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వినడం, ఇయర్ ఫోన్స్‌ను ఉపయోగించడంలో జాగ్రత్త వహించాలని సూచించారు. అందరి మద్దతు, ప్రేమతో త్వరలోనే తాను కోలుకుంటానని ఆశిస్తున్నానని.. ఈ క్లిష్ట సమయంలో అందరి సపోర్ట్ తనకెంతో అవసరమని పోస్ట్ పెట్టారు
అల్కా పెట్టిన పోస్ట్‌కు టాప్ సింగర్స్, సంగీత దర్శకులు ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. అల్కాజీ.. ఇలాంటి వార్త విన్నందుకు తనకు చాలా బాధగా ఉందని. అసలు ఊహించలేదని.. ధైర్యంగా ఉండాలని అని శ్రేయా ఘోషల్ కామెంట్ పెట్టారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఏఆర్ రెహమాన్ , సోనూనిగమ్, శంకర్ మహదేవన్ అల్కాకు మద్దతుగా నిలిచారు.
ఆరేళ్ల వయసు నుంచే పాడడం ప్రారంభించిన అల్కా యాగ్నిక్.. బాలీవుడ్‌లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు.ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు 25 భాషల్లో 20వేలకు పైగా పాటలను పాడారు. ఏడుసార్లు ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆమె ప్రతిభకు రెండు జాతీయ అవార్డులు కూడా వరించాయి. అంతేకాదు బాలీవుడ్‌లో మహిళా విభాగంలో అత్యధిక సోలో సాంగ్స్ పాడిన లిస్టులో లతా మంగేష్కర్, ఆశా భోస్లే తర్వాత అల్కా యాగ్నిక్ మూడో స్థానంలో ఉన్నారు. 2002లో వచ్చిన ‘మనసుతో’ సినిమాలో ‘చిన్ని మనసే గాలిపటమై’ అనే పాటతో అల్కా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో కూడా ఆమె పాటలు పాడారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE