రంగస్థలంలో చిట్టిబాబు పాత్రలో చెవిటివాడిగా రామ్ చరణ్ చేసిన రోల్ ఆయన కెరీర్‌కే ది బెస్ట్‌గా నిలిచింది. చెవిటి వాడిలాగా రామ్ చరణ్ మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఎంతో అద్భుతంగా నటించాడు. చెర్రీకి అందులో కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నారు కానీ, కొన్ని కారణాల వల్ల ఆ అవార్డు రామ్ చరణ్ కి మిస్ అయ్యింది. అయితే ఆ మిస్ అయిన నేషనల్ అవార్డు,‘గేమ్ చేంజర్’ మూవీకి తప్పకండా వస్తుందని..ఫ్లాష్ బ్యాక్ లో ఆయన పోషించిన అప్పన్న క్యారక్టర్ ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తుందని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
అప్పన్న క్యారక్టర్‌లో చెర్రీకి నత్తి ఉంటుందట. నత్తి వల్ల అప్పన్నకి జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురు అవుతాయని.. చివరికి ఒక పెద్ద అనర్దానికి దారి తీయడానికి కారణం కూడా ఆ నత్తే అని లీకులు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఈ క్యారక్టర్ లో జీవించేసాడని, రిలీజ్ తర్వాత ‘రంగస్థలం’ లోని చిట్టి బాబు క్యారక్టర్ ని కూడా ఇది డామినేట్ చేస్తుందని బలంగా చెబుతున్నారు సినీ పండితులు. రంగస్థలంలో చిట్టిబాబ్ క్యారక్టర్ ని డామినేట్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. నటన పరంగా రామ్ చరణ్‌ను ఎవరెస్ట్ రేంజ్‌లో చూపించిన క్యారక్టర్ అది. అలాంటి పాత్రని మించిన పాత్ర అంటే రామ్ చరణ్‌ను ఏ రేంజ్‌కు శంకర్ తీసుకెళ్లాడో అర్ధం చేసుకోవచ్చు.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ ని చూసిన తర్వాత.. రామ్ చరణ్ రోల్.. మాస్ యాంగిల్ లో, ఎమోషనల్ యాంగిల్, కామెడీ యాంగిల్ ఉంటుందన్న హింట్ వచ్చింది. మరి ఆ రేంజ్‌లోనే సినిమా కూడా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మరో 5 రోజులు ఆగాల్సిందే. ఇక ఈరోజు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి లో గ్రాండ్‌గా జరపబోతున్నారు. ఈ ఈవెంట్ కి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు.