ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీ రిలీజై 26 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 26 రోజుల్లో పుష్పరాజ్.. బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టిన వసూళ్లు చూసి ట్రేడ్ పండితులే షాక్ అవుతున్నారు. హై బడ్జెట్ గ్రాఫిక్స్ ఉన్న చిత్రాలకు తప్ప, ఇండియాలో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం అంత ఈజీ కాదనే వాదన ఉండేది. అది పూర్తిగా తప్పని ఇప్పుడు పుష్ప 2 మూవీ ప్రూవ్ చేసింది.
కమర్షియల్ సినిమాలను పర్ఫెక్ట్ గా తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లు వస్తాయి. అలాగే కనీవినీ ఎరుగని అద్భుతాలు జరుగుతాయంటూ ఈ మూవీ తన వసూళ్లతో చెప్పకనే చెప్పింది. తొలి వారంలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన పుష్ఫ 2 మూవీ, ఇప్పుడు 2000 కోట్ల రూపాయిల వైపు దూసుకుపోతోంది. 25 రోజులకు గానూ ఈ మూవీ 1760 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు నిర్మాతలు ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు.
ఇప్పటి వరకు ఎన్నో అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పిన ఈ మూవీ ఖాతాలో మరో సెన్సేషనల్ రికార్డు నమోదయ్యింది. విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో డైలీ కోటి రూపాయలకు తగ్గకుండా థియేట్రికల్ షేర్ వచ్చింది. RRR మూవీకి 17 రోజులు ఇలా నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ రాగా..ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ ‘పుష్ప 2 ‘ చిత్రానికి 26 రోజులు నాన్ స్టాప్ గా కోటి రూపాయలు రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో బుక్ మై షోలో ఈ మూవీ రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేయగా, నార్త్ ఇండియా 10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 26 వ రోజు పుష్ప 2కి 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తేలింది. నిన్నటితో ఈ మూవీ నార్త్ అమెరికా లో 15 మిలియన్ల గ్రాస్ వసూళ్ల మార్కుకు రీచయింది.