ఎపిసోడ్ 17( ఆగస్టు 6) హైలైట్స్: రవికృష్ణ పై తమన్నా వ్యాఖ్యలు, కౌంటర్ ఇచ్చిన రాహుల్, శివజ్యోతి

Akkineni Nagarjuna, Baba Master, Bigg Boss, Bigg Boss Episode 17, Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Episode-17 Highlights, Bigg Boss Telugu, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Hema, Highlights Of Bigg Boss Telugu 3, Highlights Of Bigg Boss Telugu 3 Episode 17, himaja, Jaffar, Mango News Telugu, Nominations, punarnavi, Rahul, Ravi, Rohini, Sreemukhi, Tammanah Simhadri, Varun Sandesh, Vithika

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. మొదటగా నటి హేమ ఎలిమినేట్ అవ్వగా వైల్డ్ కార్డు ఎంట్రీగా తమన్నా సింహాద్రి ఇంటిలోకి వచ్చింది, తరువాత జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. జాఫర్ ఎలిమినేషన్ తో ఇంటిలో 14 మంది సభ్యులున్నారు. ఆగస్టు 6న ప్రసారమైన బిగ్ బాస్-3 పదిఏడవ ఎపిసోడ్ లో తమన్నా సింహాద్రి ఇంటి సభ్యులపై శృతిమించి వ్యాఖ్యలు చేసింది. తమన్నా ప్రవర్తన పట్ల ఇంటి సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎపిసోడ్ 17( ఆగస్టు 6) హైలైట్స్: రవికృష్ణ పై తమన్నా వ్యాఖ్యలు, కౌంటర్ ఇచ్చిన రాహుల్, శివజ్యోతి

  • ఎపిసోడ్ ప్రారంభంలోనే తమన్నా సింహాద్రి ఇంటి సభ్యులపై అరవడం స్టార్ట్ చేసింది
  • రోహిణి, శివజ్యోతి, అలీరేజాలు తమన్నా సింహాద్రి మాటలకు కౌంటర్ ఇచ్చారు
  • నామినేషన్ గురించి వరుణ్ సందేశ్, వితికా, పునర్నవి ముచ్చట్లు పెట్టారు
  • జర్నలిజం కూడ యాక్టింగ్ అంటూ తమన్నా సింహాద్రి కామెంట్ చేయడంతో, శివజ్యోతి ఘాటుగా బదులిచ్చింది
  • రాహుల్ తనతో శ్రీముఖి మాట్లాడకపోవడం గురించి రోహిణి, శివజ్యోతి తో ముచ్చటించాడు
  • ఉదయం ఊరు ఏరయింది,ఏరు హోరెత్తింది సాంగ్ ప్లే అవ్వగా ఇంటి సభ్యులు డాన్స్ చేసారు
  • రవికృష్ణ పై తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ తమన్నా తన అటాక్ కొనసాగించింది
  • రవికృష్ణ బాధను దాచుకుంటూ కిచెన్ ఏరియాలో బాబా భాస్కర్ ను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నాడు
  • రాహుల్ శివజ్యోతి రాహుల్ తో మాట్లాడుతూ, తమన్నా విషయంలో ముందుగానే స్పందించాల్సిందని చెప్పారు. గట్టిగా కౌంటర్ ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పారు
  • రాహుల్ తమన్నా సింహాద్రికి కౌంటర్ ఇచ్చాడు, తమన్నా కొడతావా అంటూ తన మీదకి రాగా నేను అమ్మాయిలమీదే చేయి చేసుకోను, నీమీద అసలు చేసుకోను అంటూ తమన్నాతో వాదించాడు
  • శ్రీముఖిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి జరిగిన నామినేషన్లపై ఏమనుకుంటున్నారని బిగ్ బాస్ అడిగాడు. తమన్నాపై కంప్లైంట్ చేసింది
  • కన్ఫెషన్ రూమ్ లో రవికృష్ణ మాట్లాడుతూ తమన్నా ఇంటి సభ్యుల సహనాన్ని పరీక్షిస్తున్నదని, వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తుంది అని చెప్పాడు
  • తమన్నా, వరుణ్ సందేశ్ తో ఇంటి సభ్యుల గురించి మాట్లాడింది
  • బిగ్ బాస్ ఇంటి సభ్యులకు దొంగలున్నారు జాగ్రత్త అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు
  • ఊరు పెద్దలుగా వరుణ్-తమన్నా, జంటగా అలీ-పునర్నవి మరియు అన్నాదమ్ములుగా రాహుల్- మహేష్, అక్క చెల్లెలుగా రోహిణి-వితికా, బద్దకపు పోలీసుగా బాబాబాస్కర్, స్ట్రిక్ట్ పోలీసుగా శివజ్యోతి, లాయర్ గా హిమజ, రవి-శ్రీముఖి- అషు రెడ్డిలను దొంగలుగా ప్రకటించి టాస్క్ చేయమని బిగ్ బాస్ కోరాడు
  • ఇంటిలో టాస్క్ కొనసాగుతుంది, ఈ రోజు ఎపిసోడ్ లో టాస్క్ లో ఎదో జరిగినట్టు ఆసక్తికరంగా ప్రోమో విడుదల చేసారు. పూర్తీ వివరాల కోసం ఈ రోజు ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − two =