ఎపిసోడ్ 35 (ఆగస్టు 24), ఎపిసోడ్ 36 (ఆగస్టు 25) హైలైట్స్: ఎలిమినేట్ అయిన అషురెడ్డి

Bigg Boss Episode 36, Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Episode-31 Highlights, Bigg Boss Season 3 Telugu Highlights, Bigg Boss Season 3 Telugu Latest Updates, Bigg Boss Season 3 Telugu Sunday Episode, Bigg Boss Season 3 Telugu weekend Episodes Highlights, Bigg Boss Telugu, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Highlights Of Bigg Boss Telugu 3, Highlights Of Bigg Boss Telugu 3 Episode 35, Mango News Telugu

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు.ఆగస్టు 24, 25న ప్రసారమైన బిగ్ బాస్3 ముప్పై ఐదు, ముప్పై ఆరువ ఎపిసోడ్స్ లో ఇంటి సభ్యులలో కొంతమందికి నాగార్జున ఎలా నడుచుకోవాలో చెప్పారు. ఇంటిలో జరుగుతున్న గొడవలపై స్పందించారు. అయితే ఆదివారం సరదాగా ఇంటి సభ్యులతో టాస్కులు చేయించారు. ఆదివారం ఎపిసోడ్ చివర్లో అషురెడ్డి ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించారు. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి ఎలిమినేట్ అవ్వగా ఇంటిలో 11 మంది సభ్యులున్నారు.

ఎపిసోడ్ 35 (ఆగస్టు 24), ఎపిసోడ్ 36 (ఆగస్టు 25) హైలైట్స్: ఎలిమినేట్ అయిన అషురెడ్డి

శనివారం(ఆగస్టు 24) ఎపిసోడ్:

  • డోలు భజే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున వచ్చి రాగానే మన టీవీ ద్వారా ఇంటి సభ్యులు చేసే పనులు చూపెట్టారు                       
  • ఇంటిలో వరుణ్ సందేశ్ ని ఏమైనా అంటే నేను రియాక్ట్ కాకూడదా, అందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని వితికా కన్నీరు పెట్టుకుంది
  • బిగ్ బాస్ ఇంటిలో వాటర్ ఆపేసాడు, శ్రీముఖి, రాహుల్, బాబాబాస్కర్, మహేష్, పునర్నవి, శివజ్యోతి గుంజీలు తీసి క్షమాపణలు చెప్తారు.
  • చాలాసేపు వరకు వాటర్ రాకపోవడంతో శివజ్యోతి మళ్ళీ కన్నీరు పెట్టుకుంది
  • ఈగ మరణించిందని బాబాబాస్కర్ ఇంటి సభ్యులతో కలిసి సరదాగా సంతాప సభ నిర్వహిస్తాడు
  • పునర్నవి, వితికా వారి మధ్య గొడవల గురించి మాట్లాడుకుంటారు
  • ఇంటి సభ్యులు క్యారట్ హల్వా తయారు చేసి, స్టేజి పై నాగార్జునకి పంపిస్తారు
  • బాబాబాస్కర్, అలీ రేజా కు వారి ప్రవర్తన విషయంలో కొంచెం సేపు నాగార్జున క్లాస్ తీసుకుంటారు
  • ఇంటి సభ్యులను వారికీ ఎవరు మిత్రుడు, ఎవరు శత్రువు, ఎవరు వెన్నుపోటుదారులో చెప్పమని కోరతారు
  • మహేష్, శివజ్యోతి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయినట్టుగా కొండపల్లి బొమ్మలలో స్లిప్ ల ద్వారా నాగార్జున ప్రకటిస్తారు
  • మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే సస్పెన్స్ ఆదివారానికి పొడిగించారు

ఆదివారం(ఆగస్టు 25) ఎపిసోడ్:

  • హలో బ్రదర్ సినిమాలో కన్నెపెట్టరో సాంగ్ తో నాగార్జున ఎంట్రీ ఇస్తారు
  • కెప్టెన్ శివజ్యోతికి నాగార్జున ఒక టాస్క్ ఇస్తారు, జంతువుల మాస్క్లులు ఇచ్చి ఇంటి సభ్యులతో ఎవరికీ సరిపోతుందో వారికీ తగిలించి కారణం చెప్పాలని కోరతారు
  • అలీ రెజాకి సింహం మాస్క్, నక్క మొదటగా బాబా భాస్కర్ కి పెట్టి తరువాత మహేష్ విట్టాకి మారుస్తుంది. రాహుల్ కి జింక, హిమజకి ఏనుగు, శ్రీముఖికి కోతి, రవిక్రిష్ణకు శునకం, అషురెడ్డికి పాము, వరుణ్ సందేశ్ కు తాబేలు, పునర్నవికి కుందేలు, వితికా షెరుకి గొర్రెపిల్ల మాస్క్ తగిలిస్తుంది
  • తరువాత 12 మందిని ఆరుజంటలుగా మార్చి, ఒకరు మరొకరిలా నటించేలా చేస్తారు
  • ఎలిమినేషన్ నుంచి బాబాబాస్కర్, పునర్నవి, రాహుల్ కూడ సేవ్ అయినట్టు ప్రకటించారు
  • చివరకు మిగిలిన హిమజ, అషురెడ్డి లలో అషు రెడ్డి ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటిస్తారు
  • అషురెడ్డి స్టేజిపైకి వచ్చాక తన బిగ్ బాస్ జర్నీ చూపిస్తారు
  • టైల్స్ పై ఇంటి సభ్యుల బొమ్మలు ముద్రించగా, ఇంటిలో ఉండే అర్హత ఉన్నవాళ్ళవి అక్కడే ఉంచి అవసరం లేని వాళ్ళ బొమ్మలు పగలగొట్టామని చెప్తారు
  • రాహుల్, మహేష్, హిమజ, వితికా షెరు ఇంటిలో ఉండాల్సిన అవసరం లేదని వారి ఫోటోలను అషురెడ్డి పగలగొడుతుంది, మిగిలిన సభ్యులు ఉండడానికి గల కారణాలు చెప్తుంది
  • ఈ రోజు ఎపిసోడ్ లో నామినేషన్ పక్రియ ఆసక్తికరంగా సాగేలా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =